
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయినప్పటికీ సీఎస్‌కే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరినప్పటికి ప్లే ఆఫ్ అవకాశాలు మాత్రం లేవు. అయితే ఈ విజయం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ చేరే ఆశలను గల్లంతు చేసింది. కాగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే ఒక మ్యాచ్‌ను భారీ తేడాతో నెగ్గడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 2015లో పంజాబ్ కింగ్స్‌పై 97 పరుగుల తేడాతో.. 2014లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)పై 93 పరుగుల తేడాతో.. ఇక 2009లో ఆర్సీబీపై 92 పరుగుల తేడాతో భారీ విజయాలు అందుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లలో కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్ (33 బంతు ల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు.భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ ప్రత్యర్థి పేస్, స్పిన్‌కు కుప్పకూలింది. 17.4 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోన శ్రీకర్ భరత్ (8) రెండు ఫోర్లు కొట్టి నిష్క్రమించాడు. వార్నర్ (12 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్ష్ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), పంత్ (11 బంతుల్లో 21; 4 ఫోర్లు) విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment