IPL 2022 Auction: Ashwin Comments on Delhi Capitals Not Retain Himself and Shreyas Iyer - Sakshi
Sakshi News home page

Ravichandran Ashwin: నాతో పాటు అతడిని కూడా ఢిల్లీ ఫ్రాంఛైజీ రీటైన్‌ చేసుకోదు.. ఎందుకంటే!

Published Tue, Nov 23 2021 11:14 AM | Last Updated on Tue, Nov 23 2021 11:55 AM

IPL 2022 Auction: Ashwin Comments On Delhi Franchise Himself Shreyas Iyer - Sakshi

I and Shreyas Iyer will not be retained by Delhi Capitals- R.Ashwin: ఐపీఎల్‌-2022 వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అశూ.. ఈసారి వేలంలో ఫ్రాంఛైజీ తనను రీటైన్‌ చేసుకోదని వ్యాఖ్యానించాడు. తనతో పాటు శ్రేయస్‌ అ‍య్యర్‌ను కూడా అట్టిపెట్టికునే ఆలోచన యాజమాన్యానికి లేదని భావిస్తున్నట్లు తెలిపాడు. 

కాగా బీసీసీఐ ప్రకటించిన రిటెన్షన్‌ పాలసీ ప్రకారం... ఐపీఎల్‌ ప్రాంఛైజీలు అత్యధికంగా నలుగురిని రీటైన్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అశూ మాట్లాడుతూ...  ఈసారి ఢిల్లీ తనకు అవకాశం ఇవ్వబోదని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో జట్టును టేబుల్‌ టాపర్‌గా నిలిపిన కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, యువ ఆటగాడు పృథ్వీ షా, దక్షిణాఫ్రికా ఆటగాడు ఆన్రిచ్‌ నోర్ట్జేను అట్టిపెట్టుకునే అవకాశం ఉందన్నాడు.

ఇక ఈ ముగ్గురివైపే మొగ్గు చూపే క్రమంలో శ్రేయస్‌ అ​య్యర్‌ను సైతం యాజమాన్యం వదులుకునే అవకాశం ఉందని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌ వదులుకోవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ అశ్విన్‌ 7.6 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 నుంచి ఢిల్లీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లో అశ్విన్‌.. 7 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో అంచె నుంచి అందుబాటులోకి వచ్చిన  శ్రేయస్‌ అయ్యర్‌ 175 పరుగులతో రాణించాడు.

చదవండి: Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్‌.. ఆట పట్టించిన శ్రేయస్‌.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement