IPL 2022 Mega Auction: BCCI IPL 2022 Auction Date Confirmed - Sakshi

IPL 2022 Auction: ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఐపీఎల్‌ 2022 మెగావేలం!

Dec 22 2021 7:31 PM | Updated on Dec 22 2021 8:22 PM

IPL 2022 Auction: BCCI Likely Conduct IPL Auction February 7-8 Bengaluru - Sakshi

ఐపీఎల్‌ 2022 మెగావేలం ఫిబ్రవరి 7,8 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధికారి మీడియాకు అనధికారికంగా పేర్కొన్నారు. కోవిడ్‌ కారణాల రిత్యా ఈసారి మెగా వేలాన్ని రెండు రోజులు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఎప్పుడు ముంబై వేదికగా జరిగే ఐపీఎల్‌ వేలం కార్యక్రమం ఈసారి మాత్రం హైదరాబాద్‌,  బెంగళూరు వంటి నగరాల్లో నిర్వహించాలని భావించారు.

చదవండి: ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! 

ఇందులో భాగంగానే  ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ కౌన్సిల్‌ బెంగళూరును ఫైనలైజ్‌ చేసినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలోనే వేలం జరగాల్సి ఉండేది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం కాకపోవడంతో వేలాన్ని ఫిబ్రవరికి వాయిదా వేసింది.  కొత్త జట్లకు(అహ్మదాబాద్‌, లక్నో) సంబంధించి ఆటగాళ్ల ఎంపికకు డెడ్‌లైన్‌ను కూడా బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే.ఇక ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలుగా అడుగుపెడుతున్న అహ్మదాబాద్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌, లక్నో ఫ్రాంచైజీకి కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

చదవండి: ఐపీఎల్‌-2022కు స్టార్‌ బౌలర్‌ దూరం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement