టీమిండియా మాజీ క్రికెటర్.. ఐపీఎల్ 2022లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆకాశ్ చోప్రా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలాడు. ఈ విషయాన్ని ఆకాశ్ చోప్రా తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. '' రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు నా శరీరంలోకి ప్రవేశించింది. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నా. నన్ను కలిసిన వారు ఎంతకైనా మంచిది ఒకసారి కరోనా టెస్టు చేయించుకోండి. కొద్దిరోజుల పాటు ఐపీఎల్‌ను మిస్సవబోతున్నా. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా'' అంటూ పేర్కొన్నాడు.
కాగా క్రికెటర్‌గా అంతగా పేరు తెచ్చుకోలేనప్పటికి వ్యాఖ్యాతగా మాత్రం పేరు సంపాధించారు. క్రికెట్ అనలిస్ట్‌గా మంచి పేరున్న ఆకాశ్ చోప్రా.. ప్రస్తుతం ఐపీఎల్ 2022లో స్టార్‌స్పోర్ట్స్ హిందీ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఆకాశ్ చోప్రా త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
చదవండి: Ashwin Vs Tilak Varma: తిలక్ వర్మపై రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం
After dodging the bullet for nearly two years…I have also succumbed to the C Virus. Yups. Symptoms are mild thus far…🤞 should be back on the saddle soon. 💪🙏🙌 #COVID19
— Aakash Chopra (@cricketaakash) April 2, 2022
Comments
Please login to add a commentAdd a comment