IPL 2022: David Warner Cannot Become Captain Of Any Team Aakash Chopra Says - Sakshi
Sakshi News home page

Aakash Chopra : అతను కెప్టెన్‌ కాలేడు.. అయినా భారీ ధర పలకడం ఖాయం..!

Published Sat, Jan 29 2022 3:14 PM | Last Updated on Sat, Jan 29 2022 4:22 PM

IPL 2022: David Warner Cannot Become Captain Of Any Team Says Aakash Chopra - Sakshi

David Warner Cannot Become Captain Of Any IPL Team Says Aakash Chopra: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో వార్నర్‌ను ఏ జట్టూ కెప్టెన్‌గా ఎంచుకోదని, అయినప్పటికీ అతను వేలంలో భారీ ధర పలకడం మాత్రం ఖాయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌నైడర్స్‌(కేకేఆర్‌), పంజాబ్‌ కింగ్స్‌(పీకే) జట్లు కెప్టెన్ల వేటలో ఉన్న నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతానికి కెప్టెన్లు లేకుండా వేలం బరిలో దిగుతున్న మూడు జట్లకు వార్నర్‌ బెటర్‌ ఛాయిస్‌ అవుతాడని అనుకోవడంలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆకాశ్‌ చోప్రా.. ఆటగాడిగా మాత్రం అతని కోసం తీవ్ర పోటీ ఉంటుందని తెలిపాడు. మొత్తం 10 ఐపీఎల్‌ జట్లు వార్నర్‌ కోసం పోటీ పడతాయని, ఈ క్రమంలో అతనికి లీగ్‌ చరిత్రలో ఎవరికీ దక్కని భారీ మొత్తం దక్కే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు.150 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 41.2 సగటున 150 స్ట్రయిక్‌రేట్‌కు దగ్గరగా  5449 పరుగులు చేసి లీగ్‌ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్నర్‌ను ఏ జట్టూ వదులుకునే సాహసం చేయదని, అయితే దురదృష్టవశాత్తు అతను సాధారణ ఆటగాడిగానే మిగిలిపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. 

వార్నర్‌కు కెప్టెన్‌గా సైతం మంచి రికార్డే ఉన్నప్పటికీ.. వివిధ కారణాల చేత ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను సాధారణ ఆటగాడిగానే కొనసాగాల్సి వస్తుందని పేర్కొన్నాడు. 2016 సీజన్‌లో అతని సారధ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. ఫైనల్‌గా వార్నర్‌  కోసం పోటీపడే జట్ల రేసులో  ఆర్సీబీ ముందుంటుందని జోస్యం చెప్పాడు. కాగా, వార్నర్‌.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ నుంచి అవమానకర రీతిలో తొలగించడబటమే కాకుండా తుది జట్టులో చోటు సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌.. ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో కూడా అతన్ని పక్కకు పెట్టింది.
చదవండి: టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement