IPL 2022: David Warner Becomes 2nd Batter Scores More Than 1000 Runs Against One Team - Sakshi
Sakshi News home page

David Warner IPL Record: వార్నర్‌ అరుదైన రికార్డు.. రోహిత్‌ శర్మ తర్వాత ఏకైక బ్యాటర్‌గా..

Published Thu, Apr 21 2022 10:05 AM | Last Updated on Thu, Apr 21 2022 1:17 PM

IPL 2022: David Warner Rare Record Becomes 2nd Batter After Rohit Sharma - Sakshi

డేవిడ్‌ వార్నర్‌(PC: IPL/BCCI)

IPL 2022 DC Vs PBKS: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఫ్రాంఛైజీ(ప్రత్యర్థి జట్టు)పై 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం(ఏప్రిల్‌ 20) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

ఐపీఎల్‌ మెగా వేలంలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వార్నర్‌ను 6.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 191 పరుగులు సాధించాడు.అత్యధిక స్కోరు 66. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో ఈ సీజన్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేసిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. ఐపీఎల్‌లో 53వ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 60 పరుగులతో అజేయంగా నిలిచిన వార్నర్‌ భాయ్‌.. పంజాబ్‌ జట్టుపై వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. వార్నర్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ కేకేఆర్‌(1018)పై ఈ ఘనత సాధించాడు. 

ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంఛైజీపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు
రోహిత్‌ శర్మ- కేకేఆర్‌పై 1018 పరుగులు
డేవిడ్‌ వార్నర్‌- పంజాబ్‌పై 1005 పరుగులు
డేవిడ్‌ వార్నర్‌- కేకేఆర్‌పై 976 పరుగులు
విరాట్‌ కోహ్లి- సీఎస్‌కేపై 949 పరుగులు

చదవండి: IPL 2022: కుల్దీప్‌ క్రీడా స్ఫూర్తి.. ఈ అవార్డు అతడితో పంచుకుంటా.. క్రెడిట్‌ అంతా రిషభ్‌దే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement