ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన డ్రీమ్‌హౌస్ కలను నెరవేర్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో రూ.10.5 కోట్లు పెట్టి ప్రీమియమ్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. పృథ్వీ షా కొనుగోలు చేసిన ఫ్లాట్ విలువ అతని ఐదేళ్ల ఐపీఎల్ శాలరీతో సమానం. ఎకనమిక్ టైమ్స్ వివరాల ప్రకారం.. బాంద్రాలో కేసీ రోడ్‌లోని ప్రాజెక్ట్ 81 ఆరెట్ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదో ఫ్లోర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
పృథ్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 2209 స్వ్కేర్‌ఫీట్‌లో కార్పెట్ ఏరియా.. 1654 స్క్వేర్‌ఫీట్‌లో టెర్రస్‌తో అత్యంత విశాలంగా ఉంటుంది. కాగా ఈ ప్రాపర్టీని పిరమిడ్ డెవలపర్స్, అల్ట్రాస్పేస్ సంయుక్తంగా నిర్మించాయి. అంతేకాదు పృథ్వీ షాకు విశాలమైన మూడు కార్ పార్కింగ్ స్లాట్స్ ఇస్తారు. ఇక రూ. 52.50 లక్షలతో మార్చి 31నే స్టాంప్ డ్యూటీ చేయించగా.. ఏప్రిల్ 28న పృథ్వీ షా పేరుతో ఫ్లాట్ రిజిస్టర్ అయ్యింది.
ఇక ప్రస్తుతం పృథ్వీ షా ఐపీఎల్ 15వ సీజన్‌తో బిజిగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఈ సీజన్‌లో పృథ్వీ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడి 259 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న పృథ్వీ షా బౌండరీలతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తక్కువ స్కోర్లు చేసి వెనుదిరిగినప్పటికి.. వేగంగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 2018లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాను రూ.1.2 కోట్లకు మూడేళ్ల కాలానికి కొనుగోలు చేసింది. అయితే గత ఐపీఎల్‌లో ఓపెనర్‌గా దుమ్మురేపడంతో మెగావేలానికి ముందే రూ. 7.5 కోట్లతో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది.
చదవండి: Rinku Singh: తొమ్మిదో క్లాస్‌లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment