IPL 2022: DC VS PBKS Match Shifted to Mumbai From Pune After Covid Outbreak in Delhi Camp - Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వేదిక మార్పు

Published Tue, Apr 19 2022 3:26 PM | Last Updated on Tue, Apr 19 2022 5:58 PM

IPL 2022: DC VS PBKS Match Shifted To Mumbai From Pune After Covid Outbreak In Delhi Camp - Sakshi

Photo Courtesy: IPL

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రేపు (ఏప్రిల్‌ 20) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. ఢిల్లీ-పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ యధావిధిగా కొనసాగుతుందని, అయితే మ్యాచ్‌ వేదిక పూణే నుంచి ముంబైకి మార్చబడినట్లు డీసీ యాజయాన్యం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు ట్విటర్‌లో పేర్కొంది. 


ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ బృందానికి ఇవాళ మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందులో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వస్తే మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించింది. 

ఈ సందర్భంగా తమ బృందంలో కరోనా బారినపడిన వారి పేర్లను వెల్లడించింది. ప్యాట్రిక్ ఫర్హార్ట్ (ఫిజియో), మిచెల్ మార్ష్ (ప్లేయర్‌), చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్‌ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాశ్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. వీరిలో మిచెల్‌ మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఫర్హార్ట్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది. 
చదవండి: IPL 2022: సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్‌ బౌలర్‌ ఔట్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement