IPL 2022 RR Vs RCB: Fans Praises On Dinesh Karthik For His Super Batting 44 Runs Off 24 Balls - Sakshi
Sakshi News home page

Dinesh Karthik: వారెవ్వా కార్తిక్‌.. మరో 'నిదహాస్‌'ను తలపించావు

Published Tue, Apr 5 2022 11:55 PM | Last Updated on Wed, Apr 6 2022 11:51 AM

IPL 2022: Fans Praise Dinesh Karthik Super Batting 23-Balls-43 Runs Vs RR - Sakshi

దినేశ్‌ కార్తిక్‌(PC: IPL/BCCI)

IPL 2022 RCB Vs RR- Dinesh Karthik: ఐపీఎల్‌ 2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్‌ కార్తిక్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 23  బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 44 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో షాబాజ్‌ అహ్మద్‌(45)తో కలిసి కార్తిక్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. చివర్లో షాబాజ్‌ ఔటైనప్పటికి కార్తిక్‌ మాత్రం ఆఖరి వరకు నిలిచి ఆర్‌సీబీకి విజయాన్ని అందించాడు.

ఈ నేపథ్యంలో అభిమానులు దినేశ్‌ కార్తిక్‌ తాజా ఇన్నింగ్స్‌ను బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌తో పోలుస్తున్నారు. 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో కార్తిక్‌ 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాడు. కార్తిక్‌ కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌ ఎప్పటికి మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. తాజాగా ఐపీఎల్‌లో మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌తో మెరిసిన కార్తిక్‌ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. రాబోయే టి20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియాకు దినేశ్‌ కార్తిక్‌ మంచి ఫినిషర్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉ‍న్నాయని పేర్కొన్నారు.

చదవండి: IPL 2022: జోస్‌ బట్లర్‌ ఖాతాలో మరో సెంచరీ

దినేశ్‌ కార్తిక్‌ సంచలన ఇన్నింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement