Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో సీఎస్‌కే ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. అదీ మాములుగా కాదు.. డిపెండింగ్ చాంపియన్స్ అనే పదానికి నిర్వచనం చెబుతూ ఆర్‌సీబీపై భారీ తేడాతో గెలిచి సీజన్‌లో బోణీ కొట్టింది. వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన సీఎస్‌కే తాజా విజయంతో తమ వేట మొదలైందని ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా సంకేతాలు పంపింది. ఊతప్ప, శివమ్ దూబేల జోరును సీఎస్‌కే బౌలర్లు కొనసాగించి 23 పరుగుల విజయాన్ని అందించారు. మధ్యలో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ అక్కడక్కడా మెరిసినప్పటికి ధోని లాంటి వ్యూహకర్త ముందు వారి ఆటలు సాగలేదు.
ఇక మ్యాచ్‌లో కోహ్లి ఔట్ వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ అమలైంది. ఆ ప్లాన్ చెప్పింది ఎవరో కాదు.. మన మహేంద్రుడే. వాస్తవానికి కోహ్లి భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు.. కానీ సీఎస్‌కేపై కోహ్లికి మంచి రికార్డే ఉంది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీని సీఎస్‌కే ఆరంభంలోనే దెబ్బతీసింది. డుప్లెసిస్, కోహ్లి లాంటి స్టార్ బ్యాటర్స్‌ను తొందరగా పెవిలియన్ చేర్చితే జట్టు ఒత్తిలో పడ్డట్లే. దీనిని సీఎస్‌కే చక్కగా ఉపయోగించుకుంది. మొదట 8 పరుగులు చేసిన డుప్లెసిస్‌ను తీక్షణ ఔట్ చేశాడు.
Courtesy: IPL Twitter
ఆ తర్వాత క్రీజులోకి కోహ్లి వచ్చాడు. అయితే కోహ్లికి నిలదొక్కుకునే సమయం ఇవ్వకుండా ధోని మాస్టర్ ప్లాన్ వేశాడు. కోహ్లితో కలిసి ధోని దాదాపు 12 సంవత్సరాలు ఆడాడు. కోహ్లి బలహీనతలు ఏంటో ధోనికి పక్కాగా తెలుసు. షార్ట్‌పిచ్ బాల్స్ కోహ్లి బలహీనత అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అది ఒక్కటే సరిపోదు.. షార్ట్ పిచ్ బాల్ వేసినప్పటికి కోహ్లి అదే షాట్ ఆడుతానని మనం ఊహించలేం. కానీ ధోని ఊహించాడు.
ముఖేశ్ చౌదరీ 4వ ఓవర్ వేయడానికి ముందే జడేజా ఫీల్డ్ రీప్లేస్‌మెంట్‌ను మార్చాడు. ఈ దశలో డీప్‌స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డర్ కనిపించలేదు. ఇది గమనించిన ధోని.. శివమ్ దూబేకు హింట్ ఇచ్చాడు. ధోని సైగలను అర్థం చేసుకొని దూబే డీప్ స్వ్కేర్ లెగ్ వద్ద నిల్చున్నాడు. ముఖేశ్ ఊహించినట్లుగానే షార్ట్‌పిచ్ బంతి వేశాడు. ఎవరో చెప్పినట్లుగా కోహ్లి కూడా డీప్‌స్వేర్ లెగ్ దిశగానే షాట్ ఆడాడు. ఇంకేముంది అక్కడే ఉన్న శివమ్ దూబే సింపుల్ క్యాచ్ అందుకున్నాడు.. అలా కోహ్లి కథ ముగిసింది. ఆ తర్వాత పెవిలియన్‌లో కోహ్లి కూర్చున్నప్పుడు.. ధోని అతనివైపు ఒక లుక్ ఇచ్చాడు.. కోహ్లి నవ్వుతూ... ''ధోనీ బాయ్ ఇదంతా నీ ప్లాన్ కదా అన్నట్లుగా'' చూశాడు. ఇది చూసిన అభిమానులు.. ''అందుకే ధోని..నిన్ను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) అని పిలిచేది'' అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2022 CSK Vs RCB: ఐపీఎల్ చరిత్రలో ఊతప్ప-శివమ్ దూబే జోడి అరుదైన ఫీట్
CSK VS RCB: ఈ సీజన్ అత్యధిక వ్యూయర్షిప్ రికార్డైంది ఈ మ్యాచ్‌లోనే..!
Just @msdhoni things. 🦁 pic.twitter.com/88ho3S6pbf
— Sharukh (@StanMSD) April 13, 2022
that field placement was even more brilliant. not an inch of error.
— Neeche Se Topper (@NeecheSeTopper) April 12, 2022
Comments
Please login to add a commentAdd a comment