Courtesy: IPL Twitter
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో ...
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వ�...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుత�...
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ...
Published Mon, Apr 11 2022 6:53 PM | Last Updated on Mon, Apr 11 2022 11:21 PM
Courtesy: IPL Twitter
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ విలియమ్సన్(57), అభిషేక్ శర్మ(42),పూరన్(34) పరుగలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, హార్థిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(50),అభినవ్ మనోహార్(35), వేడ్(19) పరుగులతో రాణించారు. ఇక గుజరాత్‌కు ఈ ఏడాది సీజన్లో ఇదే తొలి ఓటమి.
129 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ కెప్టెన్ విలియమ్సన్ వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన విలియమ్సన్.. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఎస్ఆర్హెచ్ విజయానికి 18 బంతుల్లో 28 పరుగులు కావాలి.
15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి ఎస్ఆర్హెచ్ 116 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(46), పూరన్(7) పరుగులతో ఉన్నారు.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 75/1
5 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(18), అభిషేక్ శర్మ(6) పరుగులతో ఉన్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(50),అభినవ్ మనోహార్(35), వేడ్(19) పరుగులతో రాణించారు.
ఇక ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు సాధించగా.. జానెసన్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ సాధించారు.
గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మిల్లర్.. జాన్సెన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 118/4.
64 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన మాథ్యూవేడ్.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో హార్ధిక్ పాండ్యా(25), మిల్లర్(6) ఉన్నారు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 80/3
గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో వేడ్(17), హార్ధిక్ పాండ్యా(4) పరుగులతో ఉన్నారు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 51/2
24 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో త్రిపాఠీకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఐపీఎల్ 2022 లో భాగంగా డివై పాటెల్ స్టేడియం వేదికగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో కూడా తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరో వైపు సీఎస్కేపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ కూడా గుజరాత్‌ను మట్టి కరిపించాలని ఉర్రూతలూగుతోంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, దర్శన్ నల్కండే
Comments
Please login to add a commentAdd a comment