ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు(PC: IPL/BCCI)
IPL 2022 LSG Vs DC: వరుస ఓటములతో నిరాశలో కూరకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్‌కు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయనందున పంత్‌కు 12 లక్షల రూపాయల ఫైన్ విధించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కాగా ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్‌లో మ్యాచ్‌తో ఢిల్లీ గురువారం తలపడిన సంగతి తెలిసిందే. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. దీంతో ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఇందుకు తోడు కనీస ఓవర్ రేటు మెయింటెన్ చేయని కారణంగా జరిమానా పడింది. ఇక ఈ సీజన్‌లో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన మొదటి తప్పిదం కాబట్టి.. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టినట్లు ఐపీఎల్ పేర్కొంది.
కాగా ఐపీఎల్ గత మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, అదే తప్పు మరోసారి రిపీట్ చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెడతారు. మూడోసారి కూడా అదే పునరావృతమైతే.. కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
చదవండి: Prithvi Shaw: 'ఏం ఆడుతున్నావని విమర్శించారు'.. బ్యాట్‌తోనే సమాధానం
Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL.
— IndianPremierLeague (@IPL) April 7, 2022
Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw
Comments
Please login to add a commentAdd a comment