PC: IPL
IPL 2022: MS Dhoni- CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు పేరుంది. టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఈ జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది. డాడీస్ గ్యాంగ్ అంటూ హేళన చేసిన వాళ్లకు తమ విజయాలతోనే సమాధానం చెప్పింది. ఇదంతా ధోని నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజానికి ధోనిని, సీఎస్‌కేను విడదీసి చూడాలంటే అభిమానుల మనసు ఒప్పదు. అలాంటిది ఏకంగా మిస్టర్ కూల్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటే.. తట్టుకోవడం ఫ్యాన్స్‌కు కాస్త కష్టమే.
అయితే, జరుగబోయేది ఇదేనంటున్నాయి క్రీడా వర్గాలు. ఐపీఎల్-2022 సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్సీ చేతులు మారనున్నట్లు సమాచారం. ధోని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తన స్థానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, చెన్నై సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించాలని తలా భావిస్తున్నాడట. కెప్టెన్‌గా తన వారసత్వాన్ని కొనసాగించగల సత్తా అతడికే ఉందని భావించిన ధోని... మేనేజ్‌మెంట్‌తో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక ఆటగాడిగా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేనేజ్‌మెంట్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్న తలైవా... ఇప్పటి నుంచే జడ్డూ తన జట్టును తయారుచేసుకునే విధంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే సీజన్‌లో కెప్టెన్సీని జడేజాకు అప్పగించాలని ధోనితో పాటు ఫ్రాంఛైజీ కూడా గట్టిగా ఫిక్సయిందట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో సీఎస్‌కే ధోనితో పాటు జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే...
కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ వేలంలో రెండు రౌండ్లపాటు నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. ఆ తర్వాత..
The FL💛W! #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/su0QUaFNIj
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) January 16, 2022
Comments
Please login to add a commentAdd a comment