
Prithvi Shaw Fails Yo Yo Test: నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) క్యాంపులో ఐపీఎల్ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్ష వివరాలను ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరీక్షల్లో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య పాస్ కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు పృథ్వీ షా విఫలమయ్యాడు. యోయో టెస్ట్‌లో నిర్దేశించిన కనీస స్కోర్‌ను పొందడంలో హార్ధిక్ ఉత్తీర్ణత సాధించగా, ఢిల్లీ ఓపెనర్ చేతులెత్తేశాడు.
అయితే, ఇది కేవలం ఫిట్‌నెస్ టెస్ట్ మాత్రమేనని, ఇందులో విఫలమైతే ఐపీఎల్‌లో ఆడకుండా ఆపలేమని బీసీసీఐ స్పష్టం చేయడంతో డీసీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. యోయో టెస్ట్‌లో బీసీసీఐ నిర్ధేశించిన కనీస స్కోర్ 16.5 కాగా, షా 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు, హార్ధిక్ 17కి పైగా స్కోర్ సాధించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ ప్లేయర్లకు బీసీసీఐ ఇటీవలే 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: ఐపీఎల్ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్