ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (మే 24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్, రాజస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ ఇన్ ఫామ్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను కట్టడి చేసే విషయంలో తన గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ.. తాను రికార్డులను, ఫామ్‌ను చూసి బయపడే టైప్ కాదని వ్యాఖ్యానించాడు.
మనకు మనపై, మన నైపుణ్యంపై నమ్మకం ఉండాలే కానీ పేర్లను చూసి ఎప్పుడూ బయపడకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బ్యాటర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, భారీ షాట్లు ఆడతాడని బౌలర్ ఎప్పుడూ ఆలోచించకూడదని.. ప్రతి ఒక్కరికి ఓ బలహీనత ఉంటుందని, దాన్ని క్యాష్ చేసుకుని వ్యూహాలు రచించాలని అన్నాడు. బట్లర్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్లాన్లు తమకున్నాయని తెలిపాడు. ఇదే సందర్భంగా షమీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో కాస్త స్లో అయినప్పటికీ.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, ప్రస్తుత సీజన్‌లో మహ్మద్ షమీ గుజరాత్ లీడింగ్ వికెట్ టేకింగ్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 స్ట్రయిక్ రేట్‌తో 8 కంటే తక్కువ ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లైఫ్ టైమ్ ఫామ్‌లో జోస్ బట్లర్.. ప్రస్తుత సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతను ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 48.38 సగటున 146.96 స్ట్రయిక్ రేట్‌తో 629 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!
Comments
Please login to add a commentAdd a comment