Sanju Samson: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలువనుంది. ఈ మ్యాచ్ శాంసన్‌కు రాజస్థాన్ రాయల్స్ తరఫున వందో మ్యాచ్ కానుంది. గతంలో అజింక్య రహానే ఒక్కడే ఆర్‌ఆర్ తరఫున ఈ ఘనత సాధించాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శాంసన్ ఇప్పటి వరకు 121 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 15 అర్ధశతకాల సాయంతో 134.21 సగటున 3068 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొన్ని అరుదైన మైలురాళ్లపై కన్నేశారు.
- ఆర్‌ఆర్‌లో కొత్తగా చేరిన దేవ్‌దత్ పడిక్కల్ మరో ఐదు ఫోర్లు కొడితే 100 బౌండరీల మార్కును అందుకోనుండగా..
- ఆర్‌ఆర్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్ మరో 32 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్క్‌ను చేరుకుంటాడు. అలాగే బట్లర్ (194) మరో 6 ఫోర్లు బాదితే ఐపీఎల్‌లో 200 బౌండరీల క్లబ్‌లో చేరతాడు.
- నాథన్ కౌల్టర్ నీల్ మరో రెండు వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు.
- ప్రస్తుతం ఐపీఎల్‌లో 145 వికెట్లు పడగొట్టిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో 5 వికెట్లు పడగొడితే క్యాష్‌రిచ్ లీగ్‌లో అరుదైన150 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.
- టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 247 వికెట్లు పడగొట్టిన చహల్ మరో 3 వికెట్లు తీస్తే పొట్టి క్రికెట్‌లో 250 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
- ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు పూరన్ (295) మరో 5 సిక్సర్లు కొడితే టీ20ల్లో 300 సిక్సర్ల క్లబ్‌లో, అబ్దుల్ సమద్ (46) మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్‌లో చేరతారు.
చదవండి: ఎన్నడూ లేనంత బలంగా రాజస్థాన్.. ఏమాత్రం అంచనాలు లేకుండా ఎస్‌ఆర్‌హెచ్..!
Comments
Please login to add a commentAdd a comment