IPL 2022 GT Vs PBKS: Shubman Gill Scores 96 Runs, Creates Record In IPL History - Sakshi
Sakshi News home page

Shubman Gill: సెంచరీ మిస్‌.. అయినా 'రికార్డు' సృష్టించిన గిల్‌!

Published Fri, Apr 8 2022 11:34 PM | Last Updated on Sat, Apr 9 2022 12:12 PM

IPL 2022: Subman Gill Career Best Score IPL History 96 Runs Vs PBKS - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో శుబ్‌మన్‌ గిల్‌ తన జోరు కొనసాగిస్తున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఆడుతున్న శుబ్‌మన్‌ గిల్‌ 96 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.  59 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 96 పరుగులు సాధించిన గిల్‌ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. సెంచరీ మిస్‌ చేసుకున్నప్పటికి గిల్‌ చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లాడిన గిల్‌ 1501 పరుగులు సాధించాడు. ఇందులో 11 హాఫ్‌ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84 నాటౌట్‌గా ఉంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన అత్యధిక స్కోరును మార్చుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 96 పరుగులు సాధించి ఐపీఎల్‌లో తన కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ అందుకున్నాడు.

చదవండి: IPL 2022: బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement