
PC: IPL.com
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏన�...
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మ�...
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ క...
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల�...
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ �...
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజ...
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రత�...
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ...
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యా�...
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల...
న్యూయార్క్: ఇటీవలి కాలంలో బాంబు బెద�...
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనం�...
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
Published Sun, May 1 2022 2:49 PM | Last Updated on Sun, May 1 2022 7:45 PM
PC: IPL.com
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. అక్షర్ పటేల్ అఖరి వరకు పోరాడినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
ఢిల్లీ బ్యాటర్లలో పంత్(44), అక్షర్ పటేల్(42), మిచెల్ మార్ష్(37) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చమీరా, గౌతమ్,బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 52 పరుగులతో రాణించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.
148 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు కావాలి.
146 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది.35 పరుగులు చేసిన పావెల్ మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 22 బంతుల్లో 50 పరుగులు కావాలి.
120 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన పంత్.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఢిల్లీ విజయానికి 46 బంతుల్లో 76 పరుగులు కావాలి.
12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో పంత్(43), పావెల్(22) పరుగులతో ఉన్నారు.
86 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన లలిత్ యాదవ్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 87/4
73 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. కృష్ణప్ప గౌతం బౌలింగ్‌లో ఔటయ్యాడు.
5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో పంత్(22), మార్ష్(19) పరుగులతో ఉన్నారు.
13 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్..మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో మిచెల్ మార్ష్, పంత్ ఉన్నారు.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అదిలోనే పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. 5 పరుగుల చేసిన పృథ్వీ షా చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
20 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 52 పరుగులతో రాణించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.
176 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది.77 పరుగలు చేసిన రాహుల్.. శార్ధూల్ ఠాకుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
137 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన హుడా.. శార్ధూల్ ఠాకుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. 13 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(50),దీపక్ హుడా(48) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(35),దీపక్ హుడా(32) పరుగులతో ఉన్నారు.
7 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(20),దీపక్ హుడా(14) పరుగులతో ఉన్నారు.
42 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగలు చేసిన డికాక్.. శార్ధూల్ ఠాకుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా లక్నో సూపర్ జెయింట్స్ 22 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(18),రాహుల్(3) ఉన్నారు.
ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతం, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మన్
Comments
Please login to add a commentAdd a comment