Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. గురువారం(ఏప్రిల్7)న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. లక్నోతో మ్యాచ్‌లో తమ ప్రదర్శనపట్ల పంత్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా తమ స్పిన్నర్లు అద్భుతంగా రాణించారని పంత్ కొనియాడాడు.
"మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, మంచు ఒక్కటే మా ఓటమి కారణంగా చెప్పలేను. మా బ్యాటింగ్‌లో కూడా మేము 10 నుంచి 15 పరుగులు వెనుకబడ్డాము. మేము అఖరి బంతికి వరకు గట్టి పోటీ ఇవ్వాలి అని అనుకున్నాము. పవర్‌ప్లేలో కూడా మాకు అద్భుతమైన ఆరంభం వచ్చింది. కానీ మిడిల్ ఓవర్లలో అంతగా పరుగులు సాధించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో పంత్ పేర్కొన్నాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పృథ్వీ షా (61 రిషబ్ పంత్ (38),సర్ఫరాజ్ ఖాన్ (35)పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయి 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ సాధించాడు.
కాగా 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో డికాక్ 80 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 2, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరొక వికెట్ తీశారు.
చదవండి: IPL 2022: ధర 90 లక్షలు.. మొన్నటి దాకా బెంచ్‌కే పరిమితం.. కీలక వికెట్ తీసి.. ఆపై
Comments
Please login to add a commentAdd a comment