IPL 2022: Prithvi Shaw Fined 25% of Match Fee For Breaching Code of Conduct - Sakshi
Sakshi News home page

IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..!

Published Mon, May 2 2022 9:04 AM | Last Updated on Mon, May 2 2022 11:43 AM

Prithvi Shaw fined 25 per cent of match fee for breaching IPL Code of conduct - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షాకు జరిమానా పడింది. ఫలితంగా అతడి  మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. లెవల్‌-1 నేరానికి పాల్పడడంతో షాపై ఈ చర్యలు తీసుకున్నారు. "ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.2 కింద లెవల్‌ 1 నేరానికి పాల్పడినట్టు షా అంగీకరించాడు. మ్యాచ్‌ రిఫరీ తుది నిర్ణయం మేరకు జరిమానా విధించాం’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే పృథ్వీ షా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడన్న విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టతనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి షా నిరాశపరిచాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది.

చదవండి: IPL 2022: ధోని ఈజ్‌ బ్యాక్‌... ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement