మరో వారం రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధం చేస్తున్నాయి. వరల్డ్ టి20 ఛాంపియన్స్‌గా అవతరించిన ఇంగ్లండ్ ప్లేయర్లు రానుండడంతో ఈసారి ఐపీఎల్‌కు మరింత జోష్ వచ్చి చేరింది. ముఖ్యంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాక కోసం సీఎస్‌కే అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్ సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు.
తాను ఐపీఎల్ కోసం వచ్చేస్తున్నానని బెన్ స్టోక్స్ గురువారం (మార్చి 23) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ''త్వరలోనే మిమ్మల్ని కలుస్తా'' అంటూ చెన్నై, ఐపీఎల్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి కేవలం తన షూస్ మాత్రమే కనిపిస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. అయితే సీఎస్‌కే స్టోక్స్ ఎంట్రీకి సంబంధించిన వీడియోనూ ఇవాళ తన ట్విటర్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత వేలంలో బెన్ స్టోక్స్ ను చెన్నై టీమ్ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంలా స్టోక్స్ ను ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. గత సీజన్ లో చెన్నై దారుణమైన ప్రదర్శనతో 9వస్థానంలో నిలిచింది. ఈసారి స్టోక్స్, ధోనీ కలిస్తే మళ్లీ తమ టీమ్ మునుపటి మ్యాజిక్ చేస్తుందని చెన్నై అభిమానులు ఆశతో ఉన్నారు.
అయితే స్టోక్స్ ఐపీఎల్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అనేది చెప్పడం కష్టమే. సంప్రదాయ క్రికెట్‌కు ఎక్కువ విలువనిచ్చే స్టోక్స్ యాషెస్ సిరీస్ పై కన్నేశాడు. దీనికి తోడు అతను మోకాలి గాయంతోనూ బాధపడుతున్నాడు. అయినా సరే తాను మాత్రం సీఎస్‌కేకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. ఇక చెన్నై తమ తొలి మ్యాచ్ ను మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
See you soon @ChennaiIPL pic.twitter.com/RvJjPtHpJi
— Ben Stokes (@benstokes38) March 23, 2023
Ungal NanBEN in Namma Area! 🥳#WhistlePodu #Yellove 💛🦁@benstokes38 pic.twitter.com/5CC0YYSiKm
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2023
చదవండి: Asia Cup: ఓటమి భయం.. అందుకే రానంటున్నారు! అంత సీన్ లేదులే గానీ!
IPL 2023: గుజరాత్ భవిష్య కెప్టెన్ గిల్! ఇప్పుడు కూడా నాయకుడేనన్న విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment