కేఎల్ రాహుల్ (PC: IPL/BCCI)
IPL 2023 LSG Vs PBKS: ‘‘మేము మరో 10 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. డ్యూ(తేమ) కారణంగా పిచ్ బ్యాటర్లకు కాస్త అనుకూలించింది. నిజానికి మా బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. గత మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా పిచ్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయలేం కదా!
నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఇక్కడ మేయర్స్, పూరన్ దుమ్ములేపారు. ఇప్పుడు కూడా అలాగే ఆడి ఉంటే కచ్చితంగా 180- 190 స్కోరు చేసే వాళ్లం. కానీ దురదృష్టవశాత్తూ ఈరోజు మావాళ్లు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు.
బౌండరీ లైన్ల వద్ద ప్రత్యర్థి ఫీల్డర్ల చేతికి బంతి చిక్కడంతో తొందరగా అవుటై పోయారు. వాళ్లు గనుక కుదురుకుని ఉంటే.. మా స్కోరులో కచ్చితంగా మార్పు ఉండేది. అయితే, ఆటలో గెలుపోటములు సహజం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో
ఐపీఎల్-2023లో భాగంగా సొంతమైదానంలో లక్నో.. పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాహుల్ సేన తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ 74(56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించగా.. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ 29 పరుగులు రాబట్టాడు.
వీరిద్దరు మినహా మిగతా వాళ్లెవరూ బ్యాట్ ఝులిపించలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్నో 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను పూర్తి చేసింది.
రజా, షారుఖ్ అద్భుతం
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. సికిందర్ రజా(57) అద్భుత బ్యాటింగ్‌కు షారుఖ్ ఇన్నింగ్స్ తోడు కావడంతో లక్నోపై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది సామ్ కర్రన్ బృందం.
ఓర్వలేకే చెత్త కామెంట్లు
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. ఓటమిపై స్పందించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగానే పరాజయం పాలైనట్లు తెలిపాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో సానుకూల దృక్పథంతో ముందకు సాగుతామని వెల్లడించాడు. మరోవైపు.. కొంతమంది నెటిజన్లు మాత్రం.. హాఫ్ సెంచరీ సమయానికి రాహుల్ స్ట్రైక్‌రేటును ప్రస్తావిస్తూ అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతూ.. జట్టు ప్రయోజనాలను తాకొట్టుపెట్టొద్దంటూ విమర్శిస్తున్నారు. అయితే, రాహుల్ ఫ్యాన్స్ కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. ఐపీఎల్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అరుదైన రికార్డులు సృష్టిస్తున్న రాహుల్‌ను చూసి ఓర్వలేకే ఈ చెత్త కామెంట్లు చేస్తున్నారని మండిపడుతున్నారు.
చదవండి: MS Dhoni: ధోనిని ముద్దాడి మురిసిపోయిన ‘అత్తయ్య’.. ఖుష్బూ ట్వీట్ వైరల్
గంగూలీవైపు కోపంగా.. కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు!
Shahrukh Khan gets @PunjabKingsIPL over the line 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 15, 2023
What a finish to an epic chase 🙌
Scorecard ▶️ https://t.co/OHcd6VfDps #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/jGzGulGL45
Comments
Please login to add a commentAdd a comment