తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. పదండి ఉప్పల్‌కి అంటూ! వీడియో వైరల్‌ | IPL 2023: Rohit Sharma spoke in Telugu | Sakshi
Sakshi News home page

IPL 2023: తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. పదండి ఉప్పల్‌కి అంటూ! వీడియో వైరల్‌

Published Tue, Apr 18 2023 12:47 PM | Last Updated on Tue, Apr 18 2023 1:09 PM

IPL 2023: Rohit Sharma spoke in Telugu - Sakshi

రోహిత్‌ శర్మ(ఫైల్‌ ఫోటో)

ఐపీఎల్‌-2023లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్‌ అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. వరుసగా ఢిల్లీ, కేకేఆర్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం ఉప్పల్‌ వేదికగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాల్గోనుందుకు రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ జట్టు సోమవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.

ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మేము వచ్చేశాము.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కి అని హిట్‌మ్యాన్‌ పిలుపునిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇందుకు క్యాప్షన్‌గా రోహిత్‌ హైదరాబాద్‌ వచ్చేశాడు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా తెలుగు రోహిత్ శర్మకు విడదీయరాని అనుబందం ఉంది. రోహిత్‌ తల్లి పూర్ణిమ విశాఖపట్నంలో పుట్టింది. అదే విధంగా రోహిత్‌ ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభంలో డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఉప్పల్‌లో చాలా మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం కూడా హిట్‌మ్యాన్‌కు ఉంది.
చదవండి: IPL 2023 RCB Vs CSK: ఊహించని విధంగా కోహ్లి ఔట్‌.. షాక్‌లో అనుష్క! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement