ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 5) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 42 పరుగులు చేసిన సంజూ.. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అజింక్య రహానే పేరిట ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌టైమ్ టాప్ రన్ స్కోరర్ రికార్డును అధిగమించాడు.
నిన్నటి మ్యాచ్‌లో చేసిన 42 పరుగులు కలుపుకుని సంజూ ఇప్పటివరకు ఆర్‌ఆర్ తరఫున 3138 పరుగులు చేయగా.. రహానే 3098 పరుగులు చేశాడు. ఆర్‌ఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజూ, రహానే తర్వాతి స్థానాల్లో షేన్ వాట్సన్ (2474), జోస్ బట్లర్ (2377) ఉన్నారు. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది.
కోహ్లి.. ఆర్సీబీ తరఫున 224 మ్యాచ్‌ల్లో 129.50 స్ట్రయిక్ రేట్‌తో 6706 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సింగిల్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి తర్వాత సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీడీ, ధోని, డేవిడ్ వార్నర్, పోలార్డ్, క్రిస్ గేల్, గంభీర్, రహానే ఉన్నారు.
ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్‌సిమ్రన్ (60), కెప్టెన్ శిఖర్ ధవన్ (86 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన ఆర్‌ఆర్ కోటా ఓవర్లు పూర్తియ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్‌ను హెట్‌మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్ తెలివైన బౌలింగ్‌తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment