గుజరాత్ టైటాన్స్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సొంత మైదానంలో సన్‌రైజర్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో మోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మరింత చెలరేగిన మోహిత్.. ఆ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లలో మోహిత్ అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ సీజన్‌లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లన్నింటిలో మోహిత్ సూపర్ బౌలింగ్‌తో (చివరి ఓవర్లలో) ఆకట్టుకున్నాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చిన మోహిత్.. ఆతర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చాడు.
16th over vs MI: 4 runs.
— Johns. (@CricCrazyJohns) March 31, 2024
18th over vs MI: 9 runs.
18th over vs CSK: 11 runs.
20th over vs CSK: 8 runs.
18th over vs SRH: 10 runs.
20th over vs SRH: 2 runs.
End overs masterclass from Mohit Sharma in IPL 2024 - What a performance by the 35-year-old. 👌 pic.twitter.com/ss8Greq04Y
ప్రస్తుతం సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ మోహిత్ అదే తరహాలో బౌలింగ్ చేసి తన కోటా చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుత సీజన్‌లో మోహిత్ ప్రదర్శన చూసి గుజరాత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ మాస్టర్ క్లాస్ బౌలర్ అంటూ కితాబునిస్తున్నారు.
కాగా, సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు.
గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేసి జోరు మీదుండిన సన్‌రైజర్స్‌కు అడ్డుకట్ట వేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో నామమాత్రపు స్కోర్‌కు పరిమితం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు.
163 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వృద్దిమాన్ సాహా (25) ఔటయ్యాడు. గిల్‌కు (11) జతగా సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 45/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 90 బంతుల్లో 118 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment