Mohit Sharma.
-
IPL 2024 GT Vs SRH: లేటు వయసులో ఇరగదీస్తున్న మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సొంత మైదానంలో సన్‌రైజర్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో మోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మరింత చెలరేగిన మోహిత్.. ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లలో మోహిత్ అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లన్నింటిలో మోహిత్ సూపర్ బౌలింగ్‌తో (చివరి ఓవర్లలో) ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చిన మోహిత్.. ఆతర్వాత సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చాడు. 16th over vs MI: 4 runs. 18th over vs MI: 9 runs. 18th over vs CSK: 11 runs. 20th over vs CSK: 8 runs. 18th over vs SRH: 10 runs. 20th over vs SRH: 2 runs. End overs masterclass from Mohit Sharma in IPL 2024 - What a performance by the 35-year-old. 👌 pic.twitter.com/ss8Greq04Y — Johns. (@CricCrazyJohns) March 31, 2024 ప్రస్తుతం సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ మోహిత్ అదే తరహాలో బౌలింగ్ చేసి తన కోటా చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుత సీజన్లో మోహిత్ ప్రదర్శన చూసి గుజరాత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ మాస్టర్ క్లాస్ బౌలర్ అంటూ కితాబునిస్తున్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్ చేసి జోరు మీదుండిన సన్‌రైజర్స్‌కు అడ్డుకట్ట వేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో నామమాత్రపు స్కోర్‌కు పరిమితం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. 163 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వృద్దిమాన్ సాహా (25) ఔటయ్యాడు. గిల్‌కు (11) జతగా సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 45/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 90 బంతుల్లో 118 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. -
ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..?
ఐపీఎల్ 2023 సీజన్లో కొందరు వెటరన్లు అనూహ్యంగా సత్తా చాటారు. వీరిలో చాలా మంది తమ గతానికి భిన్నంగా రాణించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొందరు తమ సహజ శైలికి భిన్నంగా రెచ్చిపోతే.. మరికొందరు తమ యుక్త వయసులో కూడా ప్రదర్శించని దూకుడును ప్రదర్శించి తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. లేటు వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుత ప్రదర్శనలు చేసిన ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ముందుంగా చెప్పుకోవాల్సింది గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ పేరు. సరైన అవకాశాలు రాక, చాలాకాలంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉండిన 34 ఏళ్ల మోహిత్‌ను ఈ ఏడాది వేలంలో గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు 50 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ సీజన్లో ఊహించిన దానికి మించి రాణిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/10) నమోదు చేశాడు. ఈ సీజన్‌కు ఇతనే అతి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత అజింక్య రహానే.. 35 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్‌ను సీఎస్కే ఈ ఏడాది వేలంలో కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. రహానే.. తనకు సరైన అవకాశాలు రావడం లేదన్న కసితో ఆడాడో ఏమో కానీ, అతని శైలికి భిన్నంగా రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రహానే ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 169.89 స్ట్రయిక్ రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. పియుశ్ చావ్లా.. 35 ఏళ్ల ఈ వెటరన్ స్పిన్నర్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న దశలో ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పియుశ్.. అంచనాలకు మించి రాణించి, తన 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి, ముంబై క్వాలిఫయర్-2 దశ వరకు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో అత్యధిక వికెట్లు (179) సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. వీరి తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసిన వెటరన్లలో ఇషాంత్ శర్మ ఉన్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న ఇషాంత్.. ఈ సీజన్లో అనూహ్యంగా సత్తా చాటాడు. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి, ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇషాంత్ కూడా ఈ ఏడాది సర్ప్రైజ్ ఇచ్చిన ప్లేయరే అని చెప్పాలి. పై నలుగురు కాక ఈ ఐపీఎల్ సీజన్లో సర్ప్రైజ్ ప్లేయర్స్ జాబితాలో మరో ముగ్గురు వెటరన్లు ఉన్నారు. గుజరాత్.. విజయ్ శంకర్ (32 ఏళ్లు , 1.4 కోట్లు) (13 మ్యాచ్‌ల్లో 160.11 స్ట్రయిక్ రేట్‌తో 3 అర్ధ సెంచరీల సాయంతో 301 పరుగులు), రాజస్థాన్ రాయల్స్ సందీప్ శర్మ (12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు), లక్నో అమిత్ మిశ్రా (41 ఏళ్లు, 50 లక్షలు) (7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు). వీరు సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పై పేర్కొన్న ఆటగాళ్లలో దాదాపుగా అందరూ 50 లక్షల ధరకు, వివిధ జట్ల పంచన చేరిన వారే. మరి, మిమ్మల్ని ఈ ఏడాది అధికంగా సర్ప్రైజ్ చేసిన వెటరన్ ఆటగాడెవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...! -
IPL 2023: గిల్, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్: ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ జోరు కొనసాగిస్తోంది. అద్భుత బ్యాటింగ్‌తో భారీ విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ దశకు చేరువైంది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లోనే 142 పరుగులు జోడించడం విశేషం. అనంతరం కృనాల్ పాండ్యా సారథ్యంలోని లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. డి కాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. సాహా, గిల్ చెలరేగడంతో గుజరాత్ వేగంగా దూసుకుపోయింది. మొహసిన్ ఓవర్లో సాహా 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో స్కోరు 78 పరుగులకు చేరింది. సాహా 20 బంతుల్లో, గిల్ 29 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. లక్నో ఎట్టకేలకు 12వ ఓవర్లో తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయగలిగినా... గిల్‌తో పాటు కెపె్టన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిల్లర్ (12 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరు కొనసాగించి స్కోరును 200 దాటించారు. ఛేదనలో మేయర్స్, ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన డికాక్ కూడా ప్రత్యర్థి తరహాలోనే పోటీ పడి పరుగులు సాధిస్తూ ఘనమైన ఆరంభాన్నందించారు. వీరిద్దరి జోరు చూస్తే హోరాహోరీ పోరు తప్పదనిపించింది. అయితే 9వ ఓవర్లో తొలి వికెట్‌గా మేయర్స్ వెనుదిరగ్గా...ఆ తర్వాత లక్నో పరిస్థితి అంతా ఒక్కసారిగా తలకిందులైంది. మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ తర్వాత ఒక టి20 మ్యాచ్‌లో కెపె్టన్ హోదాలో అన్నదమ్ములు (కృనాల్, హార్దిక్ పాండ్యా) ప్రత్యర్థులుగా తలపడటం ఇది రెండోసారి మాత్రమే. స్కోరు వివరాలు .. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వృద్ధిమాన్ సాహా (సి) (సబ్) ప్రేరక్ మన్కడ్ (బి) అవేశ్ ఖాన్ 81; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 94; హార్దిక్ పాండ్యా (సి) కృనాల్ పాండ్యా (బి) మొహసిన్ 25; మిల్లర్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–142, 2–184. బౌలింగ్: మొహసిన్ 3–0–42–1, అవేశ్ ఖాన్ 4–0–34–1, కృనాల్ పాండ్యా 4–0–38–0, యష్ ఠాకూర్ 4–0–48–0, రవి బిష్ణోయ్ 2–0–21–0, మేయర్స్ 1–0–16–0, స్వప్నిల్ 1–0–7–0, స్టొయినిస్ 1–0–20–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) రషీద్ ఖాన్ (బి) మోహిత్ శర్మ 48; డికాక్ (బి) రషీద్ 70; దీపక్ హుడా (సి) రాహుల్ తెవాటియా (బి) షమీ 11; స్టొయినిస్ (సి) షమీ (బి) మోహిత్ శర్మ 4; నికోలస్ పూరన్ (సి) షమీ (బి) నూర్ అహ్మద్ 3; ఆయుశ్ బదోని (సి) నూర్ (బి) మోహిత్ శర్మ 21; స్వప్నిల్ (నాటౌట్) 2; కృనాల్ పాండ్యా (సి) మిల్లర్ (బి) మోహిత్ శర్మ 0; బిష్ణోయ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–88, 2–114, 3–130, 4–140, 5–153, 6–166, 7–166. బౌలింగ్: షమీ 4–0–37–1, హార్దిక్ పాండ్యా 3–0–37–0, రషీద్ ఖాన్ 4–0–34–1, నూర్ అహ్మద్ 4–0–26–1, మోహిత్ శర్మ 4–0–29–4, జోసెఫ్ 1–0–5–0. -
లేటు వయసులో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా నలుగురు 'శర్మ'లు
ఐపీఎల్-2023లో భారత వెటరన్ ఆటగాళ్లు కుర్రాళ్లతో పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. లేటు వయసులో వీరు అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన రిత్యా సరైన అవకాశాలు లేక చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరి పెర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్‌కు ముగ్దులవుతున్నారు. అవకాశాలు లేవన్న కసితో బౌలింగ్ చేస్తున్న ఈ వెటరన్లు తమ కెరీర్లు పీక్స్‌లో ఉండగా చేయని అద్భుతాలు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా నలుగరు 'శర్మ'లు తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బౌలర్లతో పాటు భారత వెటరన్ బ్యాటర్లు సైతం సత్తా చాటుతున్నారు. వీరు కూడా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు లేవన్న కసితోనే తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రదర్శన కారణంగానే రహానే ఏకంగా జాతీయ జట్టును నుంచి పిలుపునందుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. వీరు ఈ సీజన్లో మన్ముందు మరెన్ని అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి. ఐపీఎల్-2023లో రఫ్ఫాడిస్తున్న భారత వెటరన్ బౌలర్లు.. ఇషాంత్ శర్మ (ఢిల్లీ, 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 34 yrs కర్ణ్ శర్మ (ఆర్సీబీ, 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) 35 yrs మోహిత్ శర్మ (గుజరాత్, 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 34 yrs సందీప్ శర్మ (రాజస్థాన్, 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 30 yrs అమిత్ మిశ్రా (లక్నో, 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 40 yrs పియూశ్ చావ్లా (ముంబై, 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 34 yrs అశ్విన్ (రాజస్థాన్, 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 36 yrs ఐపీఎల్-2023లో రెచ్చిపోతున్న భారత వెటరన్ బ్యాటర్లు.. శిఖర్ ధవన్ (పంజాబ్, 6 మ్యాచ్‌ల్లో 148.86 స్ట్రయిక్ రేట్‌తో 65.50 సగటున 262 పరుగులు) 37 yrs అజింక్య రహానే (చెన్నై, 7 మ్యాచ్‌ల్లో 189.83 స్ట్రయిక్ రేట్‌తో 44.80 సగటున 224 పరుగులు) 34 yrs -
IPL 2023: గుజరాత్, లక్నో మ్యాచ్ ఫిక్సైంది..!
ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 22) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ క్రికెట్ ఫాలోవర్స్ ఆరోపణలు చేస్తున్నారు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఉద్దేశపూర్వకంగానే ఓటమిపాలైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అనుమానకర రీతిలో సాగిన ఈ మ్యాచ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ సాగిన తీరు అనుమానాస్పదంగా ఉందని, బీసీసీఐ అతనిపై ఓ కన్నువేసి ఉంచాలని సలహాలు ఇస్తున్నారు. గతంలో లక్నోను పలు సందర్భాల్లో గెలిపించిన పూరన్, బదోని, స్టోయినిస్, దీపక్ హుడాలలో గెలవాలన్న కసి అస్సలు కనిపించలేదని, లక్నో జట్టు సభ్యులంతా మూకుమ్మడిగా గూడుపుఠాణి ప్లాన్ చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లక్నోను తూర్పారబెతున్న నెటిజన్లు మరో పక్క మోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చివరి ఓవర్లో అతను మ్యాచ్‌ను హ్యాండిల్ చేసి తీరు అమోఘమని, ఓడాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడని ఆకాశానికెత్తుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ బెట్టింగ్‌లు నడిపే వారిపై కనకవర్షం కురిపించిందని, ఫ్యాన్స్‌ను ఫూల్స్‌ను చేసిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో లక్నో ఓటమిపాలైంది. అలవోకగా గెలవాల్సిన సందర్భంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకొని ఓటమిని కొనితెచ్చుకుంది. మోహిత్ శర్.. తన బౌలింగ్ మాయాజాలంతో (2/17)తో గుజరాత్ టైటాన్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగా.. లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదనలో లక్నో అద్భుతంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్ల తర్వాత లక్నో స్కోరు 119/3. ఆ జట్టు గెలవాలంటే 12 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి సమీకరణల్లో కూడా లక్నో గెలవలేక ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాత (ఆఖరి ఓవర్ తొలి బంతి) లక్నో టీమ్ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. చివరి బంతికి మోహిత్ శర్మ పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ గుజరాత్ వశమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (50 బంతుల్లో 66; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించగా.. లక్నో తరఫున కేఎల్ రాహుల్ (68) అర్ధ సెంచరీ చేశాడు. -
ఆశిష్ నెహ్రా వల్లే ఇదంతా