7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపు
సూర్యకుమార్ వీరోచిత శతకం
రాణించిన తిలక్, హార్దిక్, చావ్లా
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) తప్పించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది.
మొదట సన్‌రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్‌కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు.
ఆదుకున్న హెడ్
ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో బోర్ కొట్టించింది. పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది.
‘సూర్య’ మేటి ఇన్నింగ్స్
నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్‌లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్‌తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0.
Comments
Please login to add a commentAdd a comment