Gujarat titans vs Delhi capitals live Updates:
ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిద్ద్ కృష్ణ పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడం మ్యాచ్ గుజరాత్ వశమైంది. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) చివరి వరకు పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు నిస్సాంక(41) కూడా రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.
మిల్లర్.. కిల్లర్
అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ డౌన్
ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రాహుల్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.
ఢిల్లీ ఐదో వికెట్ డౌన్
160 పరుగుల వద్ద ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. డిల్లీ విజయానికి 20 బంతుల్లో 50 పరుగులు కావాలి
ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అక్షర్ పటేల్ కేవలం రెండు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్(71) ఉన్నాడు.
డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్
డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఎడమ చేతి వేలి గాయం కారణంగా మిల్లర్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.
రషీద్ ఖాన్ మ్యాజిక్
రషీద్ ఖాన్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ ఐదో బంతికి నితీష్ రాణా ఔట్ కాగా.. ఆరో బంతికి సమీర్ రిజ్వీ క్లీన్ బౌల్డయ్యాడు.
కేఎల్ రాహుల్ ఫిప్టీ
తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కేఎల్ రాహుల్.. గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఢిల్లీ తొలి వికెట్ డౌన్
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసిన నిస్సాంక.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు
6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(26), నిస్సాంక(35) ఉన్నారు.
4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/0
4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(19), నిస్సాంక(15) ఉన్నారు.
గిల్ విధ్వంసం..
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.
శుభ్‌మన్ గిల్ ఔట్
శుభ్‌మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన గిల్.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
భారీ స్కోర్ దిశగా గుజరాత్
గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(51), వాషింగ్టన్ సుందర్(41) ఉన్నారు.
గుజరాత్ రెండో వికెట్ డౌన్
జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన బట్లర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 85/2
దూకుడుగా ఆడుతున్న గుజరాత్
జోస్ బట్లర్(22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది.
గుజరాత్ తొలి వికెట్ డౌన్
19 పరుగుల గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 2.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 19/1
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ తిరిగి రావడంతో కుమార్ కుశాగ్ర బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్
Innovative 🤝 Powerful
Jos Buttler looks in the 𝙈.𝙊.𝙊.𝘿 tonight 😎#GT 68/1 after the powerplay.
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT | @josbuttler | @gujarat_titans pic.twitter.com/mLBuDqyQWl— IndianPremierLeague (@IPL) April 8, 2026


