ఉత్కంఠపోరులో లక్నో విజయం | IPL 2026: kolkata knight riders and Lucknow super giants live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠపోరులో లక్నో విజయం

Apr 9 2026 7:05 PM | Updated on Apr 9 2026 11:29 PM

IPL 2026: kolkata knight riders and Lucknow super giants live updates

KKR vs LSG Live updates: కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌  3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముకుల్‌ చౌదరి(27 బంతుల్లో 54) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించాడు. చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి అవేష్‌ ఖాన్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ముకుల్‌ చౌదరికి ఇచ్చాడు. 

ముకుల్‌ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. చివరి రెండు బంతులకు 7 పరుగులు అసవరమయ్యాయి. 

మళ్లీ ఐదో బంతికి ముకుల్‌ సిక్సర్‌ బాదాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్‌ కీపర్‌ రఘువంశీ డైరెక్ట్‌ త్రో చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి చేధించింది.

దుమ్ములేపుతున్న ముకుల్‌ చౌదరి
కేకేఆర్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాలి. ముకుల్‌ చౌదరి అద్భుతంగా ఆడుతున్నాడు.

18 ఓవర్లకు లక్నో స్కోర్‌: 152/7
18 ఓవర్లు ముగిసేసరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ముకుల్‌ చౌదరీ(26) దూకుడుగా ఆడుతున్నాడు.

కేకేఆర్‌ ఆరో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 54 పరుగులు చేసిన ఆయూశ్‌ బదోని.. అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు లక్నో స్కోర్‌: 125-6

లక్నో నాలుగో వికెట్‌ డౌన్‌
లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నికోలస్‌ పూరన్‌.. కార్తీక్‌ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

లక్నో మూడో వికెట్‌ డౌన్‌
రిషబ్‌ పంత్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌.. కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లకు లక్నో స్కోర్‌: 74-3

లక్నో రెండో వికెట్‌ డౌన్‌
లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌.. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

లక్నో తొలి వికెట్‌ డౌన్‌
41 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ వచ్చాడు.

4 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?
4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్‌ మార్‌క్రమ్‌(22), మిచెల్‌ మార్ష్‌(22) ఉన్నారు.

రాణించిన కేకేఆర్‌ బ్యాటర్లు.. లక్నో టార్గెట్‌ ఎంతంటే?
ఈడెన్ గార్డెన్స్  వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్‌(32), రావ్‌మన్‌ పావెల్‌(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌, సిద్దార్ధ్‌, దిగ్వేష్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

17 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 144/4
17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 4 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. క్రీజులో పావెల్‌(25), గ్రీన్‌(15) ఉన్నారు.
కేకేఆర్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
రింకూ సింగ్‌ రూపంలో కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్‌.. అవేష్ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 

కేకేఆర్‌ మూడో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన రఘువంశీ.. సిద్దార్ధ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
అజింక్య రహానే రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రహానే.. దిగ్వేష్‌ సింగ్‌ రాథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 102/2

7 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 65/1
7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(26), అజింక్య రహానే(27) ఉన్నారు.

కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఫిన్ అలెన్‌.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 2 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 16/1

ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గ‌త మ్యాచ్‌కు దూర‌మైన కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ నరైన్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

దీంతో బ్లెస్సింగ్ ముజ‌ర్‌బానీ బెంచ్‌కే ప‌రిమిత‌య‌మ్యాడు. అయితే స్టార్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మాత్రం త‌న చేతి వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు లక్నో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన టీమ్‌నే కొనసాగించింది.

జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్‌), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్‌), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌లు - మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్‌), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్‌లు - ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, 

Advertisement
 
Advertisement
Advertisement