ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో ల‌క్నోపై కేకేఆర్ విజ‌యం | Kolkata Register Super Over Win, Move To 6th In IPL 2026 Points Table, Check Out Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో ల‌క్నోపై కేకేఆర్ విజ‌యం

Apr 26 2026 11:58 PM | Updated on Apr 27 2026 3:33 PM

IPL 2026: Kolkata register super over win, move to 6th in points table

ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌కు అస‌లు సిస‌లైన క్రికెట్ మాజాను అందించింది. ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ ఫినిష‌ర్ రింకూ సింగ్ మ‌రోసారి అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌ను రింకూ త‌న విరోచిత హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు.

రింకూ సింగ్ కేవ‌లం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో ల‌క్నో పేస‌ర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

సెన్సేషనల్ ష‌మీ
అనంతరం లక్ష్య చేధనలో లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.  కార్తీక్ త్యాగి వేసిన‌ చివ‌రి ఓవ‌ర్‌లో ల‌క్నో విజ‌యానికి 17 ప‌రుగులు అవ‌స‌ర‌మవ్వ‌గా.. ష‌మీ చివ‌రి బంతికి సిక్స్ కొట్ట‌డంతో స్కోర్లు స‌మ‌మ‌య్యాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌తో ఫ‌లితం తేల్చాల‌ని అంపైర్‌లు నిర్ణ‌యించారు. అయితే

సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో రెండు వికెట్ల న‌ష్టానికి కేవ‌లం ఒక్క ప‌రుగు చేసింది. సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో తొలి బంతికి పూర‌న్ క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో బంతికి పంత్ సింగిల్ తీసి మార్‌క్ర‌మ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి మార్‌క్ర‌మ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రూల్స్ ప్రకారం.. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఆ త‌ర్వాత తొలి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement