లక్నోను చిత్తు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ | IPL 2026: Rajasthan royals vs Lucknow super giants Live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: లక్నోను చిత్తు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌

Apr 22 2026 7:02 PM | Updated on Apr 22 2026 11:27 PM

IPL 2026: Rajasthan royals vs Lucknow super giants Live updates

IPL 2026 RR vs LSG Live updates: లక్నోపై రాజస్తాన్‌ ఘన విజయం
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 18 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.  లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు పడగొట్టాడు.

లక్నో ఏడో వికెట్ డౌన్‌
ముకుల్ చౌదరి రూపంలో లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ముకుల్ ఔటయ్యాడు. లక్నో విజయానికి 23 బంతుల్లో 49 పరుగులు కావాలి.

లక్నో ఆరో వికెట్ డౌన్‌
లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌.. బర్గర్ బౌలిం‍గ్‌లో ఔటయ్యాడు.
లక్నో ఐదో వికెట్‌ డౌన్‌
లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన హిమత్‌ సింగ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లక్నో విజయానికి 33 బంతుల్లో 69 పరుగులు కావాలి.

రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
54 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన నికోలస్‌ పూరన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్‌: 74/4

నిలకడగా ఆడుతున్న మార్ష్‌, పూరన్‌
7 ఓవర్లకు లక్నో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్‌ మార్ష్‌(24), పూరన్‌(14) ఉన్నారు.

కష్టాల్లో లక్నో
ఐడైన్‌ మార్‌క్రమ్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

లక్నోకు భారీ షాక్‌
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. లక్నో కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్‌ పంత్‌(0), బదోని(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

రాణించిన జడేజా.. 
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
19 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోరెంతంటే?
19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్‌ హెట్‌మైర్‌.. మోహ్షిన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్‌ స్కోర్‌: 78-5

రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
20 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 62/4
రాజస్తాన్‌ మూడో వికెట్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 32/3

నిప్పులు చెరుగుతున్న షమీ
రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో రాజస్తాన్‌  వరుస బంతుల్లో జైశ్వాల్‌(22), ధ్రువ్‌ జురెల్‌(0) పెవిలియన్‌కు చేరారు.

ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్‌లతో బరిలోకి దిగింది.

అవేష్‌ ఖాన్‌,  సిద్దార్ధ్‌  స్ధానాల్లో దిగ్వేష్‌, మయాంక్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న నికోలస్‌ పూరన్‌కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 

తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్

లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్

Advertisement
 
Advertisement
Advertisement