ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రజత్ పటీదార్ మానవ్ సుతర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బెంగళూరు 15.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు.
దూకుడుగా ఆడుతున్న పడిక్కల్
5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(16), దేవ్‌దత్త్ పడిక్కల్(18) ఉన్నారు.
ఆర్సీబీ తొలి వికెట్ డౌన్
ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బెతల్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయిసుదర్శన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.
అతడితో పాటు శుభ్‌మన్ గిల్(32), జోస్ బట్లర్(25), జాసన్ హోల్డర్(23) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలా వికెట్ సాధించారు.
గుజరాత్ మూడో వికెట్ డౌన్
గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జోస్ బట్లర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
గుజరాత్ రెండో వికెట్ డౌన్
గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 100 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 170/2
సాయిసుదర్శన్ సెంచరీ
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయిసుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదర్శన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 155-1
గుజరాత్ తొలి వికెట్ డౌన్
128 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
7 ఓవర్లకు గుజరాత్ స్కోర్:61/0
7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(48), శుభ్‌మన్ గిల్(11) ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న గుజరాత్
2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(8), శుభ్‌మన్ గిల్(1) ఉన్నారు.
ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గుజరాత్ టైటాన్స్ తరపున అరంగేట్రం చేశాడు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్


