IPL 2026 SRH vs KKR Live Updates: ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది.
కేకేఆర్ బ్యాటర్లలో అంగక్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ అజింక్య రహానే(43), ఫిన్ అలెన్(29), రింకూ సింగ్(22) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్, కమ్మిన్స్,శివాంగ్ తలా వికెట్ సాధించారు.
మూడో వికెట్ డౌన్
రఘువంశీ(59) రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది.
కేకేఆర్ రెండో వికెట్ డౌన్
133 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రహానే.. షకీబ్ హసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
విజయం దిశగా కేకేఆర్
11 ఓవర్లకు కేకేఆర్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో రహానే(36), రఘువంశీ(37) ఉన్నారు. కేకేఆర్ విజయానికి 54 బంతుల్లో 56 పరుగులు కావాలి.
7 ఓవర్లకు కేకేఆర్ స్కోరెంతంటే?
7 ఓవర్లకు కేకేఆర్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో రహానే(27), రఘువంశీ(17) ఉన్నారు.
కేకేఆర్ తొలి వికెట్ డౌన్
49 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న కేకేఆర్
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 22/0. క్రీజులో రహానే(15), ఫిన్ అలెన్(7) ఉన్నారు.
కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఉప్పల్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ట్రావెస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్ తలా రెండు వికెట్లు సాధంచారు.
ఎస్‌ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ డౌన్
ఎస్‌ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన పాట్ కమ్మిన్స్ అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఎస్‌ఆర్‌హెచ్ ఆరో వికెట్ డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అనికేత్ వర్మ ఔట్ కాగా.. 16వ ఓవర్‌లో ఆరోరాను నరైన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ డౌన్
122 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్మరణ్ రవిచంద్రన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్
క్లాసెన్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్లాసెన్.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 121/3
కేకేఆర్ రెండో వికెట్ డౌన్
కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దుమ్ములేపుతున్న హెడ్
8 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(55), ఇషాన్ కిషన్(18) ఉన్నారు.
ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్
అభిషేక్ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 45/1
దూకుడుగా ఆడుతున్న హెడ్
ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు.హెడ్ కేవలం 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 27 పరుగులు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 3 ఓవర్లకు 37/0
ఐపీఎల్-2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు.
అతడి స్ధానంలో స్మరణ్ రవిచంద్రన్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా హర్షల్ పటేల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు కేకేఆర్ కూడా తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఫిన్ అలెన్‌తో పాటు మనీశ్ పాండేకు అవకాశమిచ్చారు.
తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ


