దుబాయ్: ప్రస్తుతం తాను ఐపీఎల్‌లో ఎలా ఆడాలి అన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇప్పుడు తన దృష్టిలో అన్నింటికంటే ఐపీఎల్ లీగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఈ ఏడాది జట్టులో పలు మార్పులు జరిగాయి. భారత అనుభవజ్ఞులు అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ సహా ఆసీస్ ఆటగాడు స్టొయినిస్ చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగుతుండటంతో ఎంతో సంతోషంగా ఉంది. నా సహచరులు కూడా అలాంటి అనుభూతితోనే ఉన్నారు. కొన్ని నెలలు మనం పూర్తిగా లాక్‌డౌన్ అయిపోయాం. నేనైతే షాడో ప్రాక్టీస్ చేశాను. కానీ అసలైన ప్రాక్టీస్, ఆటకు చాలా తేడా ఉంటుంది. ఆడే అనుభవమే వేరు అని తెలిపాడు. గత లీగ్ కంటే ఈ ఐపీఎల్ చాలా భిన్నమైనదని, కెప్టెన్‌గా నాపై ఉన్న అతి ముఖ్యమైన బాధ్యత ఐసీఎల్. ఈ టోర్నీకి పడిన అడుగులు, సాగే ఆటలు అన్నీ భిన్నమైనవే’నని అయ్యర్ వివరించాడు. (చెన్నై ‘హైరానా’)
Comments
Please login to add a commentAdd a comment