PC: Ireland Cricket
USA Vs Ireland ODI 2021: కోవిడ్-19 కలకలం నేపథ్యంలో యూఎస్‌ఏ, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దైంది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ట్విటర్ వేదికగా ధ్రువీకరించింది. ‘‘ముందుగా నిర్ణయించినట్లుగా ఐర్లాండ్, అమెరికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దు అయిందని చెప్పడానికి చింతిస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. యూఎస్‌ఏ క్రికెట్, క్రికెట్ ఐర్లాండ్ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కాగా ఐరిష్ జట్టు సహాయక సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్ ఫలితం వచ్చింది. అయితే, చాలా మంది క్రికెటర్ల పార్ట్‌నర్స్‌కు మాత్రం పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అందరినీ ఐసోలేషన్‌కు పంపారు. అనేక చర్చల అనంతరం ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సిరీస్‌ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం గురించి క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ రిచర్డ్ హోల్డ్'స్‌వర్త్ ... ‘‘మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికాకు ధన్యవాదాలు.
సిరీస్ రద్దు నిర్ణయం బాధించినా ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యం’’ అని తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఐర్లాండ్ జట్టు డిసెంబరు 31న వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన సహాయక సిబ్బంది ఐసోలేషన్ పూర్తి చేసుకుని, పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టుతో చేరనున్నారు. ఇక ఈ సిరీస్ తర్వాత వీలు కుదిరినపుడు అమెరికా- ఐర్లాండ్ వన్డే సిరీస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్
📡: SERIES CANCELLED
— Cricket Ireland (@cricketireland) December 28, 2021
Regrettably the scheduled ODI series between Ireland Men and USA Men has been cancelled.
➡️ Read more: https://t.co/msQWLHHluh#BackingGreen ☘️🏏 pic.twitter.com/oeTpzcNeBu
Comments
Please login to add a commentAdd a comment