ఫిఫా చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్‌ గోల్‌.. మొరాకోదే విజయం | Ismael Saibari-Scores-Fastest-Goal Morocco beat Scotland FIFA WC | Sakshi
Sakshi News home page

ఫిఫా చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్‌ గోల్‌.. మొరాకోదే విజయం

Jun 20 2026 7:05 AM | Updated on Jun 20 2026 11:17 AM

Ismael Saibari-Scores-Fastest-Goal Morocco beat Scotland FIFA WC

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మొరాకో జ‌ట్టు తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. గ్రూప్‌-సిలో భాగంగా శ‌నివారం స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మొరాకో 1-0 తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ విజ‌యంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న మొరాకో నాకౌట్ ద‌శ‌కు ఒక అడుగు దూరంలో నిలిచింది. 

మొరాకో త‌ర‌ఫున ఇస్మాయిల్ సైబారి మ్యాచ్ మొద‌లైన రెండో నిమిషంలోనే గోల్ కొట్టాడు. అయితే 71 సెక‌న్ల వ్య‌వ‌ధిలో సైబారి గోల్ కొట్ట‌డం విశేషం. త‌ద్వారా ఫిఫా  చ‌రిత్ర‌లో ఇస్మాయిల్ సైబారి కొట్టిన గోల్ అత్యంత వేగ‌వంత‌మైన‌దిగా రికార్డుల‌కెక్కింది. బోస్టన్‌లోని గిల్లెట్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌కు 64,146 మంది అభిమానుల సమక్షంలో సైబారి కళ్లు మూసి తెరిచేలోపు ఎడ్జ్‌ నుంచి బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించడం విశేషం. 

గ‌త వారం మాజీ చాంపియ‌న్స్ బ్రెజిల్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న మొరాకో ఇవాళ్టి మ్యాచ్‌లో మాత్రం స్కాట్లాండ్‌పై పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది.

ఫిఫా చ‌రిత్ర‌లో అత్యంత ఫాస్టెస్ట్ గోల్స్‌
1) హకాన్ సుకుర్ – 2002లో 11 సెకన్లు
2) వాక్లావ్ మాసెక్ – 1962లో 15 సెకన్లు
3) ఎర్నెస్ట్ లెహ్నర్ – 1934లో 25 సెకన్లు
4) బ్రయాన్ రాబ్సన్ – 1982లో 28 సెకన్లు
5) క్లింట్ డెంప్సీ – 2014లో 30 సెకన్లు
6) బెర్నార్డ్ లాకోంబే – 1978లో 31 సెకన్లు
7) ఆర్నే నైబర్గ్ – 1938లో 35 సెకన్లు
7) ఎమిలే వీనాంటే – 1938లో 35 సెకన్లు
8) ఫ్లోరియన్ ఆల్బర్ట్ – 1962లో 50 సెకన్లు
8) అడాల్బర్ట్ డెసు – 1930లో 50 సెకన్లు
8) సెయుంగ్ జిన్ పాక్ – 1966లో 50 సెకన్లు
9) సెల్సో అయాలా – 1998లో 52 సెకన్లు
10) మథియాస్ జోర్గెన్సెన్ – 2018లో 55 సెకన్లు
11) ఇస్మాయిల్ సైబారి- 2026లో 71 సెక‌న్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement