సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా జేఎన్టీయూహెచ్ (సౌత్‌జోన్) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీబీఐటీ)పై 15-7, 15-13, 15-19 స్కోర్‌తో విజయం సాధించింది. ప్రాధమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే ప్రయత్నాల్లో భాగంగా జేఎన్టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో కలిసి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను రెండు రోజుల పాటు జెఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వాలీబాల్ టీమ్‌లు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నాయి.
‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నాము’’అని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని, అభిషేక్ రెడ్డి అన్నారు. ‘‘బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము. తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని శ్యామ్ గోపు (సహ యజమాని) అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment