volleyball tournament
-
విజయవాడ మొగల్రాజపురంలో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు (ఫొటోలు)
-
విజయవాడ : హోరాహోరీగా జాతీయ వాలీబాల్ టోర్నీ (ఫొటోలు)
-
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ
అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నాట్స్ డల్లాస్ విభాగం గాంధీ జయంతి పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. డల్లాస్‌లో నాట్స్ నిర్వహించిన ఈ 16వ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. దసరా పండుగ రోజు దాదాపు 200 మంది వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నీలో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు.డల్లాస్ చాప్టర్ క్రీడా కోఆర్డినేటర్లు గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా తమ అపార అనుభవం, ప్రతిభాపాటవాలు రంగరించి ప్రణాళిక నుండి కార్యాచరణ వరకు టోర్నీని దిగ్విజయం చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అందించిన మద్దత్తు దిశానిర్దేశం వల్ల తమ మొదటి కార్యక్రమం ఇంత విజయవంతం అయిందని నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ స్వప్న కాట్రగడ్డ తెలిపారు. అందరి క్రీడా స్ఫూర్తి వల్ల నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులకు ఈ టోర్నమెంట్ మరిచిపోలేని అనుభవంగా మిగిలిందని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సాహం ఇచ్చిందని డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి అన్నారు.నాట్స్ డల్లాస్ 16వ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులను, సహకరించిన వాలంటీర్స్, వారిని ప్రోత్సహించడానికి వచ్చిన వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు డల్లాస్ చాప్టర్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ టోర్నమెంట్లో తలపడిన జట్లని రెండు విభాగాలుగా విభజించారు. ప్రో కేటగిరీ విభాగంలో విజేతలుగా వాలీ వోల్ఫ్స్ జట్టు, రన్నర్స్ గా వజ్రాస్ జట్టు నిలిచాయి. అలానే, అడ్వాన్స్డ్ విభాగంలో విజేతలుగా వికింగ్స్ జట్టు నిలవగా, రన్నర్స్ గా వాలీ డూడ్స్ జట్టు నిలిచింది.విజేతలకు, రన్నర్స్ కు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న నాట్స్ నాయకులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి,నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులు , యువతతో కూడిన జట్టులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పెద్దవారితో పోటీపడి అత్యంత ప్రతిభని ప్రదర్శించిన 8వ తరగతి విద్యార్థి కార్తీక్ కు ప్రత్యేక గుర్తింపునిస్తూ గిఫ్ట్ కార్డుని బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఇక ఈ టోర్నమెంటు నిర్వహణలో నాట్స్ డల్లాస్ చాప్టర్ టీం నుండి గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు రవి తాండ్ర మరియు కిషోర్ నారెలు, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ విన్నమూరి, పవన్ కొతారు, త్రినాథ్ పెద్ది, వంశీ వేణాటి, కావ్య, బద్రి బియ్యపు,ఇతర సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారు.ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో సాంసృతిక మరియు క్రీడా కార్యక్రమాలకు చేపట్టబోతున్నామని డల్లాస్ చాప్టర్ టీం తెలిపింది. ఈ టోర్నమెంట్ కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి డల్లాస్ టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
బ్లాక్ హాక్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత జేఎన్టీయూహెచ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా జేఎన్టీయూహెచ్ (సౌత్‌జోన్) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీబీఐటీ)పై 15-7, 15-13, 15-19 స్కోర్‌తో విజయం సాధించింది. ప్రాధమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే ప్రయత్నాల్లో భాగంగా జేఎన్టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో కలిసి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను రెండు రోజుల పాటు జెఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వాలీబాల్ టీమ్‌లు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నాయి. ‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నాము’’అని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని, అభిషేక్ రెడ్డి అన్నారు. ‘‘బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము. తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని శ్యామ్ గోపు (సహ యజమాని) అన్నారు. -
నాట్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
ఫిలడెల్ఫియా : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో ఇండోర్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో జరిగిన ఇండోర్ వాలీబాల్ టోర్నరమెంట్లో 20 జట్లు పాల్గొన్నాయి. నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని సహకారంతో నిర్వహించిన ఈ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది. స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా టీం సభ్యులు హరినాథ్ బుంగతావుల, చైతన్య పెద్దు, రామ్ కొమ్మబోయిన, శ్రీకాంత్ చుండూరు, ఫణి కడియాల, గోకుల్ పుతుంబాక తదితరులు ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. -
నాట్స్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్
డల్లాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. క్రీడాకారులతో పాటు చాలామంది తెలుగువారు ఈ టోర్నమెంటు చూసేందుకు వచ్చి వాలీబాల్ ఆటగాళ్లలోఉత్సాహాన్ని నింపారు. అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 28 జట్లు ఈ వాలీబాల్ టోర్నమెంటులో పాల్గొన్నాయి. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ల చరిత్రలో ఇది పదవ టోర్నమెంటు కావడంతో నాట్స్ డల్లాస్ టీమ్ దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. నాట్స్ బోర్డు డైరక్టర్ రాజేంద్ర మాదాల సమన్వయంతో నాట్స్ డల్లాస్ టీం సహకారంతో ఈ వాలీబాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. 250 మంది వాలీబాల్ ప్లేయర్లు ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. నాట్స్ ప్రొఫెషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ ఫన్ కప్ అనే మూడు కప్ లు పెట్టి ఈ వాలీబాల్ పోటీలు నిర్వహించింది. నాట్స్ ప్రొఫెషనల్ కప్ ను థండర్స్ టీం గెలుచుకుంది. చావోస్ టీం రన్నరప్ గా నిలిచింది. నాట్స్ వాలంటీర్ కప్ ను రేంజర్స్ టీం గెలుచుకుంది. వజ్రాస్ టీం రన్నరప్ గా నిలిచింది. రెడ్ బుల్స్ టీ నాట్స్ ఫన్ కప్ విజేతగా నిలిచింది. రన్నరప్ గా గ్రావిటీ విన్స్ వచ్చింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, ఎగ్జిక్యూటివ్ కమిటీ బాపు నూతి, విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ జాతీయ సభ్యులు కిషోర్ వీరగంధం, ఇతర నాట్స్ ప్రతినిధులు శ్రీధర్ విన్నమూరి, శ్రీనివాస్ కాసర్ల, ప్రసన్నమట్టుపల్లి, మధు మల్లు, మహేశ్ ఆదిభట్ల, మహేశ్ చొప్ప, చైతన్య, నాట్స్ నాయకులు బాపు నూతి, శ్రీధర్, మధు, సత్యం, ప్రసన్న మహేశ్, మురళీ, జనార్థన్ తదితరులు ఈ వాలీబాల్ టోర్నమెంటు విజయానికి తమ సహయసహకారాలు అందించారు. టోర్నమెంటులో విన్నర్లకు, రన్నర్లతో పాటు చక్కటి ప్రతిభ చూపిన ఆటగాళ్లకు నాట్స్ బహుమతులు అందించింది. టాంటెక్స్ వైస్ ప్రెసిడెంట్ సత్యం వీరనపు కూడా ఈ టోర్నమెంటుకు హజరై విన్నర్స్,రన్నర్స్లను అభినందించారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. బావర్చీ, స్వగృహ, చౌదరి ఆచంటలు ఈ ఈవెంట్ స్పాన్సర్లుగా వ్యవహారించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ ను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాట్స్ స్పోర్ట్స్ కమిటీ సభ్యులను నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. -
వాలీబాల్ టోర్నీపై నెత్తుటి పంజా
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదుల దురాగతం ఆత్మాహుతి దాడిలో 50 మందికిపైగా దుర్మరణం కాబూల్/ఖోస్ట్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి నెత్తుటి పంజా విసిరారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో సుమారు 50 మంది మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై వాలీబాల్ గ్రౌండ్లోకి వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్స్‌లోని యాహ్యా ఖైల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాలిబన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో అఫ్ఘాన్ నేషనల్ ఆర్మీ, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12,500 నాటో బృందాలు వచ్చే ఏడాది కూడా దేశంలో కొనసాగేందుకు అఫ్ఘానిస్థాన్ పార్లమెంట్ ఆమోదించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. యాహ్యా ఖైల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా ఈ దాడి జరిగిందని పక్తికా ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అతావుల్లా ఫజిల్ వెల్లడించారు. ఈ సమయంలో మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని, ప్రొవిన్షియల్ అధికారులు, పోలీస్ చీఫ్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారని చెప్పారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది నెలలుగా తాలిబన్ ఉగ్రవాదులు యుద్ధం ప్రకటించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వరుస దాడులు చేస్తున్నారు. దేశంలో అత్యంత క్లిష్టమైన పక్తికా ప్రాంతంలో గత జూలైలోనూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రద్దీ మార్కెట్లోకి ట్రక్కుతో ప్రవేశించిన ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 41 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా, వాలీబాల్ టోర్నమెంట్ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడిని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఖండించారు. తాజా దాడి ఈ ఏడాది అఫ్ఘాన్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా అధికారులు పేర్కొంటున్నారు.