డల్లాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. క్రీడాకారులతో పాటు చాలామంది తెలుగువారు ఈ టోర్నమెంటు చూసేందుకు వచ్చి వాలీబాల్ ఆటగాళ్లలోఉత్సాహాన్ని నింపారు. అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 28 జట్లు ఈ వాలీబాల్ టోర్నమెంటులో పాల్గొన్నాయి. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ల చరిత్రలో ఇది పదవ టోర్నమెంటు కావడంతో నాట్స్ డల్లాస్ టీమ్ దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది.
నాట్స్ బోర్డు డైరక్టర్ రాజేంద్ర మాదాల సమన్వయంతో నాట్స్ డల్లాస్ టీం సహకారంతో ఈ వాలీబాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. 250 మంది వాలీబాల్ ప్లేయర్లు ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. నాట్స్ ప్రొఫెషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ ఫన్ కప్ అనే మూడు కప్ లు పెట్టి ఈ వాలీబాల్ పోటీలు నిర్వహించింది. నాట్స్ ప్రొఫెషనల్ కప్ ను థండర్స్ టీం గెలుచుకుంది. చావోస్ టీం రన్నరప్ గా నిలిచింది. నాట్స్ వాలంటీర్ కప్ ను రేంజర్స్ టీం గెలుచుకుంది. వజ్రాస్ టీం రన్నరప్ గా నిలిచింది. రెడ్ బుల్స్ టీ నాట్స్ ఫన్ కప్ విజేతగా నిలిచింది. రన్నరప్ గా గ్రావిటీ విన్స్ వచ్చింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, ఎగ్జిక్యూటివ్ కమిటీ బాపు నూతి, విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ జాతీయ సభ్యులు కిషోర్ వీరగంధం, ఇతర నాట్స్ ప్రతినిధులు శ్రీధర్ విన్నమూరి, శ్రీనివాస్ కాసర్ల, ప్రసన్నమట్టుపల్లి, మధు మల్లు, మహేశ్ ఆదిభట్ల, మహేశ్ చొప్ప, చైతన్య, నాట్స్ నాయకులు బాపు నూతి, శ్రీధర్, మధు, సత్యం, ప్రసన్న మహేశ్, మురళీ, జనార్థన్ తదితరులు ఈ వాలీబాల్ టోర్నమెంటు విజయానికి తమ సహయసహకారాలు అందించారు. టోర్నమెంటులో విన్నర్లకు, రన్నర్లతో పాటు చక్కటి ప్రతిభ చూపిన ఆటగాళ్లకు నాట్స్ బహుమతులు అందించింది. టాంటెక్స్ వైస్ ప్రెసిడెంట్ సత్యం వీరనపు కూడా ఈ టోర్నమెంటుకు హజరై విన్నర్స్,రన్నర్స్‌లను అభినందించారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. బావర్చీ, స్వగృహ, చౌదరి ఆచంటలు ఈ ఈవెంట్ స్పాన్సర్లుగా వ్యవహారించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ ను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాట్స్ స్పోర్ట్స్ కమిటీ సభ్యులను నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.
Comments
Please login to add a commentAdd a comment