VBIT
-
బ్లాక్ హాక్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత జేఎన్టీయూహెచ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా జేఎన్టీయూహెచ్ (సౌత్‌జోన్) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీబీఐటీ)పై 15-7, 15-13, 15-19 స్కోర్‌తో విజయం సాధించింది. ప్రాధమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే ప్రయత్నాల్లో భాగంగా జేఎన్టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో కలిసి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను రెండు రోజుల పాటు జెఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వాలీబాల్ టీమ్‌లు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నాయి. ‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నాము’’అని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని, అభిషేక్ రెడ్డి అన్నారు. ‘‘బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము. తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని శ్యామ్ గోపు (సహ యజమాని) అన్నారు. -
VBIT కాలేజీ వ్యవహారంలో నిందితులు అరెస్ట్
-
బీటెక్ విద్యార్థి అదృశ్యమా.. డ్రామాలా!
వలిగొండ: గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఇంజనీరింగ్ విద్యార్థి గణేష్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్ అయ్యాడా.. అదృశ్యమయ్యాడా.. లేక ఎక్కడో తలదాచుకుంటూ కావాలనే డ్రామాలు ఆడుతున్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో గణేష్ ఉన్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్లు ఎస్ఐ ప్రకాశ్ తెలిపారు. నేటి సాయంత్రంలోగా అతడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పచెబుతామని చెప్పారు. ఓ వైపు ఈ నెల 6వ తేదీ నుంచి తమ కుమారుడు గణేష్ కనిపించడం లేదని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయగా, మరోవైపు గణేష్ మాత్రం తరచుగా బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వారు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం జరిగిందంటే... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన గణేష్ ఘట్కేసర్ లోని వీబీఐటీ బీటెక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గణేష్ అదే కాలేజీకి చెందిన తన ప్రియురాలితో కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. తాము తీసుకున్న లాడ్జి రూములోనే ఆత్మహత్య చేసుకుందామని సూచించాడు. ప్రియురాలు వద్దని చెప్పినా సూసైడ్ చేసుకునేందు క్రిమిసంహారక మందు తెచ్చేందుకు వెళ్లాడు. చెప్పా పెట్టకుండ ఆ యువతి హైదరాబాద్‌కు చేరుకుని అనంతరం కాలేజీకి వెళ్లి విషయాన్ని చెప్పింది. గణేష్ మాత్రం ఇంటికి తిరిగిరాలేదని, అదృశ్యమయ్యాడని అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.