జాంటీ రోడ్స్.. ఈ పేరు వినగానే సంచలన క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు చేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు సౌతాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్ తర్వాత ఫీల్డింగ్ కోచ్‌గా మారిన జాంటీ రోడ్స్ తన మార్క్‌ను చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే రోడ్స్ మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే పిచ్‌పై కవర్లను కప్పడం చూస్తాం. కానీ ఆ కవర్లు లాగడానికి గ్రౌండ్స్‌మెన్ చాలా కష్టపడతారు. చాలా బరువుండే దానికి గ్రౌండ్‌లోకి తీసుకురావడం కత్తిమీద సామే. ఆ కష్టం తెలిసినోడు కాబట్టే జాంటీ రోడ్స్ గ్రౌండ్స్‌మెన్‌కు తనవంతు సాయం చేశాడు.
విషయంలోకి వెళితే... బుధవారం సీఎస్‌కే,లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. లక్నో ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో గ్రౌండ్ సిబ్బంది రెయిన్ టర్పైన్ కవర్లతో గ్రౌండ్‌లోకి వస్తున్నారు. ఇది గమనించిన జాంటీ రోడ్స్ వారితో పాటు కవర్‌ను లాగేందుకు యత్నించాడు. సిబ్బంది వద్దని వారించినా రోడ్స్ వినిపించుకోకుండా తన పని కానిచ్చాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వద్దు సార్... మేం చూసుకుంటాం అనగానే రోడ్స్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
.@JontyRhodes8 to the rescue 😃👌🏻
— IndianPremierLeague (@IPL) May 3, 2023
No shortage of assistance for the ground staff in Lucknow 😉#TATAIPL | #LSGvCSK pic.twitter.com/CGfT3dA94M
ఇక లక్నో సూపర్‌జెయింట్స్, సీఎస్‌కే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. లక్నో తొలి ఇన్నింగ్స్ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు స్పష్టం చేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్‌జెయింట్స్ 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆడుతుంది. ఆయుష్ బదోని 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment