
PC: IPL.com
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ కాస్త స్లో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఓ భారీ సిక్సర్ మాత్రం బాదాడు.
రాజస్తాన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన యుధ్వీర్ బౌలింగ్‌లో బట్లర్ 112 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండవ అతి పెద్ద సిక్సర్ కావడం గమనార్హం. కాగా ఐపీఎల్-2023లో ఇప్పటివరకు అతి పెద్ద సిక్సర్ కొట్టిన రికార్డు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పేరిట ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ 115 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో చేతిలో 10 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్(44), జోస్ బట్లర్(40) మినహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
చదవండి: IPL 2023: నీకెందుకు ఈ ఆట.. వెళ్లి డ్యాన్స్‌లు వేసుకో పో! 3 కోట్లు దండగా..
IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..
— A (@cricketvf) April 19, 2023
Comments
Please login to add a commentAdd a comment