Photo Credit: Twitter
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. తద్వారా టెస్టుల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్న హాజిల్‌వుడ్ ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 14వ సారి ఐదు వికెట్ల హల్ అందుకున్న హాజిల్‌వుడ్.. ప్రస్తుతం ఆసీస్ జట్టులో 300 వికెట్ల మార్క్ చేరుకున్న నాథన్ లియోన్, కమిన్స్, స్టార్క్ సరసన నిలిచాడు.
ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఏడో పేసర్‌గా హాజిల్‌వుడ్ నిలిచాడు. గతంలో మెక్‌గ్రాత్ (563 వికెట్లు), మిచెల్ స్టార్క్ (435 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (355 వికెట్లు), పాట్ కమిన్స్ (316 వికెట్లు), మిచెల్ జాన్సన్ (313 వికెట్లు), బ్రెట్ లీ (310) హాజిల్‌వుడ్ కంటే ముందున్నారు.
టెస్టుల్లో 300 వికెట్లు పడగొట్టే క్రమంలో ఆస్ట్రేలియా తరఫున తక్కువ సగటుతో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలోనూ హాజిల్‌వుడ్ చోటు సంపాదించాడు. హాజిల్‌వుడ్ 24.02 సగటుతో 300 వికెట్ల మార్క్ చేరుకోగా, మెక్‌గ్రాత్ (21.64), కమిన్స్ (22.21), డెన్నిస్ లిల్లీ (23.92) ముందున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తంజిద్ హసన్ (101) సెంచరీతో చెలరేగగా, నజ్ముల్ (84) రాణించాడు. మూడో రోజు ఆటలో మెహదీ హసన్ (65) అర్ధశతకం సాధించడంతో బంగ్లా 400 పరుగుల మార్క్‌ను దాటింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 228 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్ 2, కమిన్స్, లియోన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. స్మిత్ (37), గ్రీన్ (6) క్రీజులో ఉన్నారు. ఆసీస్ మరో 131 పరుగులు వెనుకబడి ఉంది.
Josh Hazlewood joins an elite club - he becomes the 7th Australian pacer and 9th Australian bowler overall to 300 Test wickets 👏#AUSvBAN pic.twitter.com/Yag1VUY34k
— Cricbuzz (@cricbuzz) August 15, 2026
Josh Hazlewood also bagged his 14th fifer in Tests with his 300th scalp 🔥pic.twitter.com/7S6oFzafUq https://t.co/JB4JIGl9b7
— Cricbuzz (@cricbuzz) August 15, 2026
చదవండి: అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్‌లైన్ అప్పుడే!


