PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్తాన్ ఊదిపడేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్( 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్), శాంసన్(48 నాటౌట్) విధ్వంసం సృష్టించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
జోస్ బట్లర్‌కు జరిమానా
ఇక రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్‌లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బట్లర్ లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఖాతా తెరవకుండానే బట్లర్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: #RajasthanRoylas: బంతుల పరంగా అతిపెద్ద విజయం.. ఐపీఎల్ చరిత్రలో రెండో జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment