పుణె: రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్- ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మధ్య జరిగిన మాటల యుద్ధం గుర్తుండే ఉంటుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టు సందర్భంగా పంత్ క్రీజులో ఉన్నపుడు, ‘నేను, నా భార్య సినిమాకెళ్లి చాలా రోజులైపోయింది. మా ఇంట్లో నువ్వు బేబీ సిట్టర్‌గా ఉన్నావనుకో, మేమిద్దరం సరదాగా సినిమాకి వెళ్లాం ఎంజాయ్ చేస్తాం’ అంటూ పైన్ స్లెడ్జింగ్ చేశాడు. ఇందుకు పంత్ బదులిస్తూ.. ‘ఈ రోజు మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్. ఎపుడైనా ఇలాంటి తాత్కాలిక కెప్టెన్‌ను చూశామా? దాని గురించి విన్నామా?’ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తన నివాసంలో ఆసీస్- టీమిండియాకు ఆత్మీయ విందు ఏర్పాటు చేయగా, పంత్ నిజంగానే పైన్ మాటల్ని నిజం చేసి చూపించాడు. పైన్ భార్య బోని తన ఇద్దరి పిల్లల్ని అక్కడికి తీసుకుని రాగా, వారిలో ఒకరిని పంత్ ఎత్తుకున్నాడు. ఆ ఫొటోను బోని తన ఇన్‌స్ట్రాగామ్‌లో సరదాగా ‘పంత్ బెస్ట్ బేబీ సిట్టర్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయగా, పంత్‌పై పైన్ సెటైర్లు వేస్తే, అతడి భార్య మాత్రం ఇలా కితాబు ఇచ్చిందంటూ నెటిజన్లు ఆసీస్ కెప్టెన్‌ను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. టీమిండియా మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ సైతం బేబీ సిట్టర్(తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేనపుడు పసిపిల్లల ఆలనాపాలన చూసే సంరక్షకులు అని అర్థం)గా అవతారమెత్తాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ విజయం సాధించిన అనంతరం భారత జట్టు అంతా ఒక్కచోట చేరి సరదాగా సమయం గడిపింది. ఈ క్రమంలో.. ‘‘బబుల్ ఉన్నా లేకపోయినా సరే, ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటాం. ఫలితాలు వస్తూనే ఉంటాయి. పుణెలో అందమైన రోజు’’ అంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇందులో, హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్యను కేఎల్ రాహుల్ ఎత్తుకుని ఉన్నాడు. ఇంకేముంది, అప్పటి నుంచి నెటిజన్లు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, కేఎల్ రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇక మరో ఫోటోలో, పంత్ దగ్గరికి వెళ్లేందుకు అగస్త్య ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాడు. దీంతో.. ‘‘ఏంటి రాహుల్.. భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీసు చేస్తున్నావా. నీ కంటే పంత్ మంచి బేబీ సిట్టర్ అవుతాడేమో. ఎందుకంటే, తనకు కాస్త అనుభవం ఎక్కువ. అగస్త్యకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే తన దగ్గరికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాడు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ సైతం.. ‘‘చూడండి. బేబీ అగస్త్యను కేఎల్ ఎత్తుకున్నాడు. నిజం చెప్పాలంటే భారత వికెట్ కీపర్లు మంచి, నమ్మకమైన బేబీ సిట్టర్లు’’ అంటూ చెణుకులు విసిరాడు.
చదవండి: ప్రసీద్ కృష్ణపై ప్రశంసలు.. రాహుల్ ద్రవిడ్‌కు కితాబు
See KL holding baby Agastya there. Indian WK bats are always reliable babysitters 😉 #INDvsENG https://t.co/3PCrEuepTh
— Wasim Jaffer (@WasimJaffer14) March 24, 2021
Comments
Please login to add a commentAdd a comment