
అబుదాబి : ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత చలాకీగా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సృష్టించిన కోహ్లి ఇతర ఆటగాళ్లను కూడా అప్పుడప్పుడు ఇమిటేట్ చేస్తుంటాడు. వారం క్రితం ఏబీ డివిలియర్స్ సూపర్ క్యాచ్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లి ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఇమిటేట్ చేశాడు. ప్రాక్టీస్ సందర్భంగా అచ్చం స్మిత్ బ్యాటింగ్ శైలిని అనుసరించాడు. స్మిత్ బ్యాటింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. బ్యాటింగ్ చేయడానికి ముందు స్మిత్ శరీరాన్ని మొత్తం కదిలిస్తుంటాడు. సరిగ్గా స్మిత్‌ను గుర్తుకుతెచ్చేలా కోహ్లి నిల్చున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి బ్యాట్ పట్టిన తీరు చూస్తే ఆడుతుంది స్మిత్ అనే అనుమానం కూడా కలుగుతుంది. (చదవండి : కోహ్లి రెండు పరుగులు.. వాటిని పరిగణిస్తారా?)
కాగా ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకుపోతూ టైటిల్ ఫేవరెట్‌గా మారింది. విరాట్ కోహ్లి ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 365 పరుగులతో ఆ జట్టు తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు చెలరేగిపోవడం.. ఆ తర్వాత సునాయాస విజయాన్ని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే 10 మ్యాచ్‌లాడిన ఆర్‌సీబీ 7 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్ సీఎస్‌కేతో అక్టోబర్ 25న తలపడనుంది.
Imitating Smith 😂. pic.twitter.com/ctb4rX3VhA
— Anikethan (@_shortarmjab_) October 21, 2020
Comments
Please login to add a commentAdd a comment