సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్‌ ఇన్నింగ్స్‌ అంటూ! | Kohli lauds Suryakumar Yadav after latter scores brilliant century against NZ | Sakshi
Sakshi News home page

IND vs NZ: సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్‌ ఇన్నింగ్స్‌ అంటూ!

Published Sun, Nov 20 2022 5:32 PM | Last Updated on Sun, Nov 20 2022 5:56 PM

Kohli lauds Suryakumar Yadav after latter scores brilliant century against NZ - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ సెంచరీని సూర్య నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్‌ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్‌పై భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.

"సూర్య ప్రపంచంలోనే నెం1 ఆటగాడు ఎందుకు అయ్యాడో చెప్పడానికి ఈ ఒక్క ఇన్నింగ్స్‌ చాలు. నేను అతడి ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఇది మాత్రం అతడి మరొక వీడియో గేమ్‌ ఇన్నింగ్స్‌" అని కోహ్లి ట్వీట్‌ చేశాడు. కాగా కోహ్లి చేసిన ఈ పోస్టు  ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అతడు పోస్ట్‌ చేసిన 40 నిమిషాల్లోనే 60,000 పైగా లైక్‌లు వచ్చాయి. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో సూర్య, కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ కలిసి జట్టుకు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌కు విరాట్‌ కోహ్లి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.


చదవండి: IND vs NZ: దీపక్‌ హుడా సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement