నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో 83 వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.
ఏం జరిగిందంటే?
భారత్ తొలి ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేసిన నాథన్ లయన్ బౌలింగ్‌లో ఐదో బంతిని విరాట్ కోహ్లి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో విరాట్ సింగిల్ కోసం ముందుకు వచ్చి నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మకు పిలుపునిచ్చాడు. దాంతో రోహిత్ పరుగు కోసం పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. అయితే బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్లడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్న కోహ్లి.. రోహిత్ శర్మకు సడన్‌గా నో అంటూ మళ్లీ వెనుక్కి వెళ్లిపోయాడు.
ఇక అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లపోయిన రోహిత్ శర్మ చాలా వేగంగా మళ్లీ వెనుక్కి వచ్చాడు. అయితే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న లియాన్ స్టంప్స్ పడగొట్టినప్పటికీ.. రోహిత్ శర్మ అద్భుతమైన డైవ్‌తో క్రీజులోకి చేరుకున్నాడు.
దీంతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి రోహిత్ తప్పించుకున్నాడు. అయితే తన వల్ల రనౌట్ అయ్యే ప్రమాదంలో పడ్డ రోహిత్ శర్మకి కోహ్లి క్షమాపణలు చెప్పాడు. దీనికి రోహిత్ పర్వాలేదనట్లుగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ILT20 2023: ముంబై ఎమిరేట్స్ ఔట్.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్
— Nitin Varshney (@NitinVa15588475) February 10, 2023
Comments
Please login to add a commentAdd a comment