
Courtesy: IPL
ఐపీఎల్ 2022లో కుల్దీప్ యాదవ్ అదరగొట్టే ప్రదర్శన చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 2019 నుంచి చూసుకుంటే కుల్దీప్ 15 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అవన్నీ పరిగణలోకి తీసుకొని చూసుకుంటే కుల్దీప్ యాదవ్‌కు ఇవే బెస్ట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. గత సీజన్ వరకు కోల్‌కతాకు ఆడిన కుల్దీప్ ఒక్క సీజన్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
తాజాగా మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ముంబైతో ఆడిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో దుమ్మురేపాడు. కాగా కుల్దీప్ ప్రదర్శనపై అభిమానులు కామెంట్స్ చేశారు.. అబ్బా కుల్దీప్ ఎన్నాళ్లకు అదరగొట్టావయ్యా.. ఈ ప్రదర్శన చేయలేక టీమిండియాలో చోటు కోల్పోయావు.. త్వరలో మళ్లీ భారత్ జట్టులోఅ అడుగుపెట్టాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు.