‘మెస్సీ గురించి ప్ర‌శ్న‌లెందుకు’.. రొనాల్డో అసహనం! | From Goals To Controversy, Ronaldo Shines For Portugal But Avoids Messi Questions After Victory, Watch Video Inside | Sakshi
Sakshi News home page

‘మెస్సీ గురించి ప్ర‌శ్న‌లెందుకు’.. రొనాల్డో అసహనం!

Jun 24 2026 9:15 AM | Updated on Jun 24 2026 1:55 PM

 Lionel Messi Questions Leave Cristiano Ronaldo Fuming-This-Is-Non-sense

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పోర్చుగ‌ల్ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఉజ్బెకిస్తాన్‌పై 0-5 తేడాతో పోర్చుగ‌ల్ విక్ట‌రీ అందుకుంది. మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న గోల్స్‌ ఖాతాను ప్రారంభించాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంత‌రం రిపోర్టర్లు అడిగిన ప్ర‌శ్న‌లు రొనాల్డోకు చిరాకు తెప్పించాయి. 

మ్యాచ్ ప్ర‌ద‌ర్శ‌న‌పై ప్ర‌శ్న‌లు అడ‌గాల్సింది పోయి.. ఇప్పుడు కూడా త‌న చిర‌కాల ప్రత్య‌ర్థి లియోన‌ల్ మెస్సీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించడం ప‌ట్ల రొనాల్డో అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. అంతేకాదు రిపోర్టర్లు అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేసే ప్ర‌య‌త్నం చేసిన రొనాల్డో ముక్త‌స‌రిగానే స‌మాధాన‌మిచ్చాడు. 'రికార్డు స్థాయిలో ఇద్ద‌రు (మెస్సీ, రొనాల్డో) ఆరోసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్నారు? దీనిపై స్పంద‌నేంటి' అని రిపోర్ట‌ర్ అడిగాడు. దీనికి రొనాల్డో 'నో కామెంట్' అని స‌మాధాన‌మిచ్చాడు. 

'ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస రెండు మ్యాచ్‌లు క‌లిపి మెస్సీ ఐదు గోల్స్ కొట్టాడు. ఇంకా ఎంబాపె కూడా* అని అడుగుతుండ‌గానే'.. రొనాల్డో త‌లను ప‌క్క‌కు తిప్పి 'వేరే ప్ర‌శ్న అడ‌గండి' అని రిపోర్ట‌ర్‌కు చుర‌క‌లు అంటించాడు. 'ముందు అడిగిన ప్రశ్న‌కు స‌మాధానం చెప్పండి' అని మ‌రో రిపోర్ట‌ర్ పేర్కొనగా.. దానికి వెంట‌నే రొనాల్డో.. 'మీరు అడిగే ప్ర‌శ్న‌పై నా జ‌వాబు ఆదార‌ప‌డి ఉంటుంది. అన‌వ‌స‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌ను' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. 

ఇక చివ‌రిగా టోర్నీలో రాబోయే రోజుల్లో మెస్సీతో మ్యాచ్ ఆడాల్సి వ‌స్తే ఎలా ఫీలవుతారు అని అడిగారు. 'ఈ ప్ర‌శ్న‌కు ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. నాకు తెలిసి ఇదొక అర్థం కాని ప్ర‌శ్న‌. కానీ ఎదురుప‌డితే పోటీ అద్భుతంగా ఉంటుంది' అని స‌మాధానమిచ్చాడు. రిపోర్ట‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు రొనాల్డో స‌మాధానం ఇచ్చిన తీరుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పోర్చుగల్ మంగళవారం ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 5-0తో గెలుపొందింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (ఆట 6వ, 38వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా.... నూనో మెండెస్ (17వ నిమిషంలో), రాఫెల్ బియో (87వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఖుసనోవ్ 60వ నిమిషంలో రెండు గోల్స్ సెల్ఫ్ గోల్ చేయ‌డంతో అవి పోర్చుగ‌ల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి.

Read: పోర్చుగ‌ల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రొనాల్డో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement